బంగ్లాదేశ్ గురువులకు,యువత యానిమేటర్లకు ఆధ్యాత్మిక సదస్సు.

యూత్ ఎపిస్కోపల్ కమీషన్ చైర్మన్ చిట్టగాంగ్‌ అగ్రపీఠదైపతులు మహా పూజ్య లారెన్స్ సుబ్రతో హౌలాడర్ గారు , యువతను యథాతథంగా అంగీకరించడానికి, వారితో స్నేహపూర్వకంగా మరియు సోదరభావంతో వ్యవహరించేలా యూత్ కోఆర్డినేటర్‌లు మరియు యానిమేటర్‌లను ప్రేరేపించారు.

బంగ్లాదేశ్‌లోని ఎనిమిది మేత్రాసనాల నుండి 50 మందికి పైగా యువ గురువులు మరియు యానిమేటర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.
 మేత్రాసనంలోని యువతకు ఆధ్యాత్మిక మరియు నైతిక రూపాన్ని అందించడం ద్వారా వారు క్రైస్తవ నైతికతలో ఏర్పడి దేవాలయాల కోసం నిజమైన సాక్ష్యం ఇవ్వగలిగేలా, కథోలిక బోధన గురించి తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.
"యూత్ స్పిరిచువాలిటీ ఆఫ్ కంపానిమెంట్: వైనింగ్ అండ్ గైడింగ్ ఆఫ్ యంగ్ హార్ట్స్"అనే అంశం గురించి గురుశ్రీ పోలాష్ హెన్రీ గోమ్స్ గారు తన ఆలోచనలను వ్యక్తపరిచారు.
ఢాకా అగ్రపీఠాధిపతులు యూత్ కోఆర్డినేటర్ గరుశ్రీ నయన్ గోసల్ గారు " యువకుల అవకాశాలు మరియు మన పాస్టోరల్ రెస్పాన్స్" గురించి తన మాటలను యువతతో పంచుకున్నారు.
 "కోఆర్డినేటర్ మరియు యానిమేటర్‌గా, వారి పాత్రల నుండి శిఖరాగ్రానికి చేరుకోవడానికి వారిని ప్రేరేపించడం" అని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్ నలుమూలల నుండి క్రైస్తవ యువకులు మరియు యానిమేటర్‌లతో పరిచయం పొందడానికి మరియు వారితో సంభాషించడానికి ఇది ఒక గొప్ప వేదిక అని వారిలో ఒక యువకుడు తన భావనను పంచుకున్నాడు

Add new comment

1 + 5 =