బంగ్లాదేశ్‌- అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

బంగ్లాదేశ్‌, రాజ్‌షాహి మేత్రాసనం క్రిస్తు జ్యోతి పాస్టరల్ సెంటర్‌లో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (IWD) ఘనంగా నిర్వహించారు.

మేత్రాసన ల్యేటీ కమీషన్ మరియు CCP బృందం కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాయి.

"Digital: Innovation and technology for gender equality"  ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యం.

ప్రపంచవ్యాప్తంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను జరుపుకోవడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

రాజ్‌షాహి మెత్రానులు మహా పూజ్య గెర్వాస్ రోజారియో గారు తన ప్రారంభ ప్రసంగంలో, "తాను కూడా ఒక స్త్రీ నుండి జన్మించారని. జీవసంబంధమైన తేడాలు తప్ప స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి తేడా లేదు" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్‌షాహి మేత్రాసనం నుండి 210 మంది మహిళలు, పీఠాధిపతులు, ముగ్గురు గురువులు, ఏడుగురు మఠకన్యలు మరియు పదిమంది పురుషులు పాల్గొన్నారు.
 

Add new comment

4 + 14 =