Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
బంగ్లాదేశ్‌లో 38వ జాతీయ యువతా దినోత్సవం
Tuesday, February 28, 2023
బంగ్లాదేశ్, ఖుల్నా మేత్రాసనం, మోంగ్లాలోని పునీత పాల్ గారి విచారణలో 38వ జాతీయ యువతా దినోత్సవాన్ని (NYD) ఫిబ్రవరి 17-21 వరకు నిర్వహించారు.
ఎపిస్కోపల్ కమిషన్ ఫర్ యూత్ (ECY) మరియు ఖుల్నా మేత్రాసన సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఖుల్నా మేత్రాసన యువతా కోఆర్డినేటర్లను, గురువులను, గురువిద్యార్దులను, మఠకన్యలను వారి సంస్కృతికి సంబంధించి మిఠాయిలు మరియు పూలతో స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
చిట్టగాంగ్ అగ్రపీఠాధిపతులు, ఎపిస్కోపల్ కమిషన్ ఫర్ యూత్ అధ్యక్షులైన మహా పూజ్య లారెన్స్ సుబ్రతో హౌలాడర్ గారు యూత్ క్రాస్-ఇన్‌స్టాలేషన్ వేడుకను నిర్వహించారు.
బంగ్లాదేశ్‌లోని ఎనిమిది మేత్రాసనాల నుండి 530 మందికి పైగా యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Add new comment