ప్రేమతో...

విశాఖపట్నం లోని  కైలాసపురం లో గల "వేలాంగణిమాత దేవాలయం విచారణ" లో ఉన్న మన  సహోదరి, సహోదరుల కొరకు ప్రేమతో  "అమృతవాణి రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు"(RVA Telugu) వారు సహాయం చేయడం జరిగినది.

కైలాసపురం విచారణలో అవసరంలో ఉన్న 12 కాథోలిక కుటుంబాలను గుర్తించి వారికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగినది. కైలాసపురం విచారణ యూత్ ( St.Claret Youth ) సహాయంతో, విచారణ సహాయక గురువు రేవ్ ఫాదర్ జాసిన్ జోసఫ్ చేతులమీదుగా ఈ  కార్యక్రమం జరిగినది. "అమృతవాణి రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు" ఆన్లైన్ ప్రొడ్యూసర్ (Online producer)  యం.కె. స్వరూప్ ఆధ్వర్యం లో  "మన సహోదరి సహోదరులు కొరకు ప్రేమ తో.."  అనే ఈ కార్యక్రమం జరుగుతుంది. కోవిడ్-19 సెకండ్ వేవ్  కారణంగా పనులు లేక, రోజువారీ పనులే చేసే అవకాశం లేక  ఇబ్బంది పడుతున్న కాథోలిక కుటుంబాలకు సహాయం అందిస్తున్నారు. మన యేసు ప్రభుని ప్రేమను చూపిస్తూ ఇప్పటి వరకు వివిధ విచారణలో ఉన్న సుమారు 35 కాథోలిక కుటుంబాలకు సహాయం చేయడం జరిగినది. సహకరించిన విచారణ యూత్ ( St.Claret Youth ) మరియు ఫాతిమా, ప్రశాంతి, వినయ్, రాజా లకు ప్రతేక్య కృతజ్ఞతలు.    

 

 

Add new comment

3 + 0 =