ప్రారంభమైన తెలుగు ప్రాంతీయ కతోలిక యువతా సదస్సు

ప్రారంభమైన  తెలుగు ప్రాంతీయ కతోలిక యువతా సదస్సు .

ఏలూరు పీఠం లో ఈ సదస్సు నాలుగు రోజులు జరగనున్నది. తెలుగు రాష్ట్రాల నుండి యువతీ యువకులు ఆదివారం అనగా 15.05.2022 న ఏలూరు పీఠం చేరుకున్నారు. సుమారు 1000  మందికి పైగా  యువతీ యువకులు పాల్గొంటున్నారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అమలోద్భవి మాత క్యాథెడ్రల్ నందు సమావేశమై పరస్పర పరిచయ కార్యక్రం జరిగినది.
అనంతరం సాయంత్రం 6.30  లకు   గురుశ్రీ బాబు జార్జ్ (Chancellor) , విచారణ కర్తలు గురుశ్రీ మైఖేల్  మరియు మేత్రాసన యువత డైరెక్టర్స్ లతో కలసి సమిష్టి దివ్య పూజబలి ని  సమర్పించారు.
ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రాంతీయ యువతా విభాగం అధ్యక్షులు మరియు  ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య జయరావు పొలిమేర గారి  ఆధ్వర్యం లో యువజన సదస్సు ప్రారంభోత్సవ దివ్య బలిపూజ  ఘనం గా జరిగింది.
యువతీ యువకులు ఉత్సాహం తో  ఈ సదస్సు లో పాల్గొంటున్నారు.

 

Add new comment

12 + 5 =