ప్రాంతీయ యువతా సదస్సు

గుంటూరు మేత్రాసనం, బట్టిప్రోలు, క్రీస్తు రాజు దేవాలయము నందు అక్టోబర్ 3 మరియు 4 తేదీల్లో బెంగుళూరు ప్రావిన్స్‌కు చెందిన క్లరేషియన్ సభ వారు ప్రాంతీయ యువత సదస్సును నిర్వహించారు.

గురుశ్రీ జైపాల్ తుమ్మా (Prefect of Youth and Vocation ), గురుశ్రీ మార్టిన్ – ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల ప్రాంతీయ యువతా  కోఆర్డినేటర్, గురుశ్రీ రవి మరియు జయరాజ్ గార్ల  నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు

గురుశ్రీ జైపాల్ గారు పరిచయ వాక్యాలతో వివిధ మేత్రాసనాలనుండి విచ్చేసిన గురువులకు, కన్యస్త్రీలకు, యువతీయువకులకు ఆహ్వానం పలికారు. 

CCBI యువతా కమిషన్ సలహాదారి మిస్టర్ సాగర్ గబ్బేట గారు  "విచారణలో యువత నాయకత్వం" అనే అంశం పై ఉదయం సెషన్లో మాట్లాడగా, "సాంఘిక ప్రసార మాధ్యమం" పై 
సిస్టర్ సుధ SOM మధ్యాహ్నం సెషన్ నిర్వహించారు. 

సాయంత్రం గురుశ్రీ మార్టిన్ గారిచే దివ్యసత్ప్రసాద ఆరాధన, గురుశ్రీ జయపాల్ గారు దివ్యపూజాబాలిని సమర్పించగా, "Youth,you are the Future" అనే అంశంపై గురుశ్రీ విలియం గారు ప్రసంగించారు.

ఓలేరు-గుంటూరు, చోడవరం,కైలాసపురం- విశాఖపట్నం, నల్లజర్ల- ఏలూరు, భట్టిప్రోలు-గుంటూరు, కర్నూలు, బాసురేగడి-హైదరాబాద్ మరియు నర్సన్నపేట- శ్రీకాకుళం నుండి యువకులు  సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.

రెండవ రోజు ప్రార్థన, జపమాల మరియు గురుశ్రీ రవి గారిచే దివ్యబలిపూజతో ప్రారంభమైంది.
మొదటి సెషన్ లో "క్రైస్తవ యువత ఎదుర్కొంటున్న సవాళ్లపై "  మిస్టర్ సాగర్ గబ్బేట గారు 
మాట్లాడగా, సిస్టర్ సుధ గారు " విశ్వాస జీవితం"పై రెండవ సెషన్  నిర్వహించారు. 

మధ్యాహ్న భోజనం తరువాత, మేడ్చల్‌, సెయింట్ క్లారిటీ  హైస్కూల్ల్ ప్రిన్సిపాల్ గురుశ్రీ అంతోని పసల గారు బైబిల్ క్విజ్‌ను  నిర్వహించారు.

ఈ పోటిలో 4 రౌండ్లు మరియు ఒక్కొక్క రౌండ్‌లో పునీత లూకా సువార్తపై 10 ప్రశ్నలు కలవు. వివిధ విచారణ నుండి ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారు.

విజేతలుగా మొదటి స్థానంలో - నల్లజెర్ల- ఏలూరు మేత్రాసనం 
రెండవ స్థానంలో  - కైలాసపురం—విశాఖపట్నం అగ్రపీఠం
మూడవ స్థానంలో - చోడవరం- విశాఖపట్నం అగ్రపీఠం వారు నిలిచారు.

గురుశ్రీ మార్టిన్ గారు సదస్సుకు విచ్చేసిన గురువులకు మఠవాసులకు,యువతా యానిమేటర్లుకు, రిసోర్స్ పర్సన్స్కు  మరియు యువతకు ధన్యవాదాలు తెలియచేసారు.

ఈ సదస్సుకు 315 మంది యువకులు, 9 మంది గురువులు,7 మంది కన్యస్త్రీలు మరియు 5 యూత్ యానిమేటర్లు హాజరయ్యారు.

Add new comment

5 + 5 =