ప్రాంతీయ యువతా కేంద్రం- ఉద్యోగ మేళ యాప్ ప్రారంభం

ఏలూరు,సెయింట్ జోసఫ్ దంత కళాశాలలో 2022 ఫిబ్రవరి 22న  టి.సి.బి.సి యువతా విభాగం అధ్యక్షులు, ఏలూరు పీఠాధిపతులు మహా ఘన. జయరావు పొలిమెర తండ్రి గారి ప్రోత్సాహంతో, టి.సి.బి.సి ప్రాంతీయ యువతా విభాగం డైరెక్టర్ గురుశ్రీ సగిలి ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో ఉద్యోగ మేళ యాప్ ప్రారంభించడం జరిగింది 

10వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివి, సరైన ఉద్యోగం అవకాశాలు లేక బాధపడుతున్న నిరుద్యోగ యువకోసమే ఈ ఆప్ సిద్ధం చేసారని తెలిపారు. 

తెలుగు ప్రాంతీయ కతోలిక యువతా ఉద్యమంలో భాగంగా యువతలో ఆత్మసైర్యాన్ని పెంపొందించి, ఉద్యోగ నైపుణ్యాలతో శిక్షణ ఇచ్చి అర్హతకు తగిన ఉద్యోగంలో నూటికి నూరుశాతం చేర్చడానికి ఈ కృషి . 

క్రింది లింక్ ద్వారా మీ వివరాలను నింపి బయోడాటాను అప్లోడ్ చేయగలరు.

tinyurl.com/m4pjobs

Add new comment

1 + 6 =