ప్రపంచ వృద్ధుల దినోత్సవం

ప్రపంచ వృద్ధుల దినోత్సవం

2022 సంవత్సర ప్రధాన అంశము: "వృద్ధాప్యంలో కూడా, కాయలు కాయుచూ, పచ్చగా కలకల లాడుచుందురు." (కీర్తన 92:14)

ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని (World Grandparents and Eldery Day) పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 2021 సంవత్సరములో ప్రకటించారు. విశ్వ కతోలిక శ్రీసభలో, ప్రతి సంవత్సరం, జూలై నెల నాల్గవ ఆదివారము నాడు, ఈ పండుగను నిర్వహించుకొంటున్నాము. ఈ సందర్భంగా, మన సంఘములోని వృద్ధులను, పెద్దలను, మన కుటుంబములోని అమ్మమ్మ తాతయ్యలను, గౌరవించుకుంటూ, వారిని సన్మానిస్తూ, వారికై ప్రార్థిస్తూ, వారు చేసిన త్యాగాలను, ఆదర్శ జీవితాన్ని నెమరు వేసుకుందాము. వారి అనుభవ పాఠాలు, మనవళ్లు మనవరాళ్లకు, నేటి యువ ప్రపంచానికి, గొప్ప నిధిగా ఉన్నదని కనుగొని ఆచరించుదాం  . వారిని సన్మానించుట ద్వారా, వారు ఈ ప్రపంచానికి అందించిన విలువలను మనం సన్మానిస్తున్నాము.  అమ్మమ్మ తాతయ్యలను, వృద్ధులను గౌరవించుకుంటూ, వారు సమాజానికి, క్రైస్తవ శ్రీసభకు విలువైన ఆణిముత్యాలుగా, యువతరం గ్రహించేలా చేద్దాము. ఒకవేళ, మన కుటుంబంలో అమ్మమ్మలు తాతయ్యలు మరణించినచో, వారి ఆత్మల నిత్య విశ్రాంతి నిమిత్తము ప్రత్యేకంగా ప్రార్థించుదము.

గమనిక: మన కుటుంబంలోని పెద్దల నిమిత్తము, వారికి ఆయురారోగ్యములు దయచేయమని, వారు ఆదరణ పొందునట్లు, వారి శ్రేయస్సును కోరుకుంటూ ప్రార్ధించుదాం.

Add new comment

7 + 2 =