ప్రపంచ రక్తపోటు దినోత్సవం

 ప్రపంచ రక్తపోటు దినోత్సవం
హైపర్‌టెన్షన్ అంటే అధిక రక్తపోటు సమస్య. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఒత్తిడితో కూడుకున్న జీవితం, ఉరుకులు పరుగులు తీసే ఉద్యోగాలతో ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక దశలో ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ ఒత్తిడి రక్తపోటును ప్రభావితం చేస్తుంది. శుద్ధి అయిన రక్తం గుండె నుంచి శరీర భాగాలకు ధమనుల ద్వారా సరఫరా అవుతుంది. రక్తం రక్తనాళాలలో ప్రవహించేటప్పుడు వాటి గోడలపై కలిగించే ఒత్తిడిని రక్తపీడనం (BP- Blood Pressure) అంటారు. ఈ సరఫర మామూలు వేగం కంటే అధిక వేగంగా సరఫరా కావడాన్ని అధిక రక్తపోటు (Hypertension) లేదా అధిక రక్తపీడనం (హై బిపి- High blood pressure)  అంటారు.

ఇండియా కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలోని ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ ఉందని.. కేవలం 10 శాతం మంది రోగులకు మాత్రమే వారి రక్తపోటు నియంత్రణలో ఉందని వెల్లడించింది. లో-బీపీ, హైబీపీ ఉన్న వారు పోషకాలున్న మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తుంది. బీపీ పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.టీనేజర్లు, యువత కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలియజేసారు.

ఆరోగ్యవంతుడైన మానవుని సాధారణ రక్తపీడనం (BP) 120/80 ఉండాలి. ఇది 140/90 కంటే ఎక్కువైతే అధిక రక్తపోటు (Hypertension)  (హై బిపి) గాను, 90/60 కంటే తక్కువైతే అల్ప రక్తపోటు (Hypotension)  (లో బిపి) గాను అంటారు. ఈ రెండు ప్రమాదకరమైనవే.

అధిక కొవ్వు ,కొవ్వు పదార్ధాలను తరచుగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, ఆందోళన ,డిప్రెషన్ వంటివి రక్తపోటుకు ప్రధాన కారణాలు.దోసకాయ, పుచ్చకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకుంటే హైపర్‌టెన్షన్‌లో చాలా ఉపశమనం లభిస్తుంది. అధిక BP కోసం కెఫిన్ ఉత్పత్తులను నివారించడం చాలా ముఖ్యం. ఆహారంలో ఉప్పు కూడా తక్కువగా తీసుకోవాలి. రక్తపోటు నుండి బయటపడటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. 

Add new comment

1 + 0 =