ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతోమంది చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. వివిధ దేశాల్లో, యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో సర్వం కోల్పోయి అనాథలుగా మారినవారి సంక్షేమం కోసం నేడు ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం/ వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్‌ (World Day of War Orphans)ను నిర్వహిస్తున్నారు.
యుద్ధాలు కారణంగా ఎంతోమంది సాధారణ పౌరులు చనిపోతున్నారు. కొన్ని లక్షలమంది చిన్నారులు అయినవారిని కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 900,000 కంటే ఎక్కువ మంది పిల్లలు అనాథలుగా మారినట్లు నివేదికలు చెపుతున్నాయి. ఇలాంటి  పిల్లలను  చేరదీసి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ రోజున అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనాథ పిల్లలు ఎదురుకొంటున  మానసికంగా, సామాజికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లును రూపుమాపి, వారి సంక్షేమానికి బాటలు వేయడమే వరల్డ్ వార్ ఆర్ఫాన్స్‌డే లక్ష్యం.
 

Add new comment

15 + 0 =