ప్రపంచ జనాభా దినోత్సవం

జనాభా పెరుగుదల అత్యంత ముఖ్యమైన అంశం. రోజు రోజుకు పెరుగిపోతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, సమస్యలపై అవగాహన కలిగించేందుకు ఏటా జులై 11 న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1989లో ఐక్య రాజ్య సమితి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

2010లో ప్రపంచ జనాభా 700 కోట్లు దాటింది. ప్రస్తుతం భూమిపై 800 కోట్లకు పైగా ప్రజలున్నారు. వీరిలో చైనా, ఇండియా కలిపి... 250 కోట్ల మందికి పైగా ఉన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే... మానవ వనరులు అత్యవసరం. అలాగే ఏ దేశమైనా తిరోగమనం చెందేందుకు కూడా మానవ వనరులు కారణం అవుతున్నాయి. అందువల్ల జనాభా అనే వనరును సక్రమంగా ఉపయోగించుకోకపోతే, ప్రపంచ గమనానికే ముప్పు తప్పదన్నమాట.

 

Add new comment

19 + 0 =