పునీత డాన్ బోస్కో యువత దినోత్సవం మరియు స్వర్గీయ ఫాదర్ కొలంబో గారి 13వ వర్థంతి

వరంగల్ మేత్రాసనం, మల్కాపూర్ మండలం, తాటికాయల గ్రామం పరిశుద్ధ ఫాతిమా మాత దేవాలయము నందు ఆగష్టు 31, 2022న పునీత డాన్ బోస్కో యువత దినోత్సవం మరియు స్వర్గీయ ఫాదర్ కొలంబో గారి 13వ వర్థంతిని జరుపుకున్నారు.

ఈ కార్యక్రమము ఉ. 11.00 గం.కు ప్రార్థన మరియు స్వర్గీయ ఫాదర్ కొలంబో గారి చిత్రపటాల ముందు స్మృత్యాంజలితో ప్రారంభమైంది.

కల్పాల ప్రవీణ్ కుమార్ గారిచే "యువతకు నా సాక్ష్యం"
దీన బాంధవుడు ఫాదర్ కొలంబో గారు, యువకుల ప్రియుడు డాన్ బోస్కో గారు, యువత మేలుకో, యువతలో విలువలు - వ్యసనాలు, యువతకు నా సలహా అనే అంశాలపై రచన (వ్యాసం, పాట, పద్యాలు, కవితలు) పోటీలు జరిగాయి.

గబ్బెట సాగర్ గారి ఆధ్వర్యంలో, సెయింట్ జేవియర్ సెమినరీ, కరుణాపురం బ్రదర్ల సహకారంతో మ. 2.00 గం. నుండి 5.00 గం.ల వరకు ఆటల పోటీలు.
సా. 6.30 గం.లకు దివ్య బలిపూజ సమర్పించారు, పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు మరియు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

విచారం బాలబాలికలు, యువతీ యువకులు, కతోలిక సంఘస్తులు ఉత్సాహంగా పాల్గొనారు 
 

Add new comment

11 + 7 =