పిల్లవాడు తరచూ అబద్దాలు చెప్తున్నాడంటే అది పెద్దలకు ఒక హెచ్చరిక. పెద్దలు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు

children lies ఒక పిల్లవాడు అబద్దం చెప్పడానికి దారితీసే కారణాలు ఏంటి?

పిల్లవాడు తరచూ అబద్దాలు చెప్తున్నాడంటే అది పెద్దలకు ఒక హెచ్చరిక. పెద్దలు  తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు 

ఒక పిల్లవాడికి 8 నుండి 9  సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నిజానికి, ఊహకు మధ్య వ్యత్యాసం తెలుసుకోవడం కొంచం కష్టంగానే ఉంటుంది. నిజమేదో గ్రహించలేక నిజం నుండి దూరంగా వెళ్లిపోయే అవకాశం ఉంది. సరిగ్గా గమనిస్తే, ఆ సమయంలోనే వారు మనకు ఎన్నో సృజనాత్మక అసత్యాలు చెప్తారు. మరి పెద్ద పిల్లల విషయంలో ఏమనుకోవాలి? మరలా మరలా అసత్యాలు చెప్పడంలో అసలు సంగతేంటి?

 ఒక పిల్లవాడు అబద్దం చెప్పడానికి దారితీసే కారణాలు ఏంటి?

కుటుంబంలో చిన్నవాళ్లైనా ఈ పిల్లల మాటలు ఎవరు వినిలించుకోకపోయినా, కుటుంబ సమస్యలతో పెద్దలు సతమతమౌతూ, పిల్లల గురించి పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, పెద్దల దృష్టిని తమ వైపు తిల్లుకోవడానికి పిల్లలు అబద్దాలు చెప్తారు. కానీ వారి ఎదిగి పెద్దవారౌతున్నప్పుడు వారి ఊహాత్మక ద్రుష్టి తొలగి సత్యం తెలుస్తున్న సమయంలో వారు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, చేసిన తప్పుల శిక్షను తప్పించుకోవడానికి వీరు మరలా మరలా అబద్దాలు చెప్తారు.

ఇటువంటి సమయంలో మనం మోసపోయినట్లు కనపడకుండా, పిల్లవాడిని నిజానికి దగ్గరగా తీసుకురావడం చాలా ముఖ్యం. లేకుంటే పెద్దలను మోసగించానని, పిల్లవాడు మరింత ప్రోత్సాహం పొందుతాడు. అబద్దాన్ని విస్మరించడం అంటే దానిని ప్రోత్సహించడమే.

కొన్ని సార్లు, అతిగా శిక్షించే తల్లిదండ్రుల శిక్ష నుండి తప్పించుకోవడానికి పిల్లలు అబద్దాలు చెప్తారు. మరిముఖ్యంగా పిల్లలు కౌమార దశ లో ఉన్నప్పుడు, వారు గుర్తింపును, గౌవరవాన్ని కోరుకుంటారు. ఈ సమయంలో అబద్దం అంటే స్వీయ గౌరవానికి చిహ్నంగా అనుకోవచ్చు.

పిల్లల అబద్ధాల పట్ల సహనం కలిగి ఉండాలి

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు ఎలా స్పందించాలి? వారి పిల్లలను నిజానికి దెగ్గరగా తీసుకు రావడానికి ప్రయత్నించాలి. వారి అబద్దాలను ఎంత ఎంత ఎక్కువగా విస్మరిస్తే వారు అంత ఎక్కువగా అబద్దాలను చెప్తారు.

పెద్దల దృష్టిని కోరుకునే పిల్లల విషయంలో మనం ఆ పిల్లలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ పిల్లవాడు మనకు వ్యతిరేకంగా ఉన్నాడనిపిస్తే స్పందించకుండా ఉండడమే మంచిది. పెద్దలు, పిల్లల తప్పుల కంటే,  వారు నమ్మిన సిద్ధాంతాలకు ఎక్కువ విలువ ఇవ్వాలి.

పిల్లవాడు తాను చేసిన ఏదైనా తప్పు నుండి బైట పడడానికి అబద్దం చెప్తున్నాడా? అప్పుడు ఆ అబద్దం వల్ల తనకు జరిగే నష్టం గురించి వివరించి, మంచి విలువలను గూర్చి పిల్లవాడికి అర్థమయ్యేటట్లు వివరించాలి. వారు నిజం ఒప్పుకుంటే, అబద్దం చెప్పినందుకు దండించకుండా, నిజం ఒప్పుకున్నందుకు వారి ధైర్యాన్ని అభినందించండి.

శిక్ష విషయంలో మనం నిరంకుశత్వం గా ఉన్నాం అని పిల్లలు అనుకున్నా, మనం అనుకున్నా విలువలకు కట్టుబడి ఉండాలి. పిల్లలు తమ తప్పులకు పశ్చాత్తాప పడేటట్లు చెయ్యలేగాని అర్ధంలేని శిక్షలతో వారిని శిక్షించకూడదు.

చివరిగా, ఒక పిల్లవాడిని అబద్ధీకుడని ఎప్పుడు అనవద్దు. ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. "నేను ఎప్పుడైనా అబద్దాలు చెప్పానా?" 

Add new comment

3 + 15 =