పల్స్ పోలియో ప్రోగ్రాం

పల్స్ పోలియో ప్రోగ్రాం :

పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ప్రతి ఏటా  పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మన రెండు తెలుగు రాష్ట్రాల వైద్యాధికారులు సిద్ధమవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పల్స్ పోలియో (Pulse Polio 2022) కార్యక్రమం జరగనుంది. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు ఈరోజు  అందించనున్నారు.ఇందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ సెంటర్లు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, ఎయిర్‌ పోర్టులు, పర్యాటకప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇంకా వ్యాక్సిన్ వేయాల్సిన చిన్నారులు ఎవరైనా ఉంటే వారికీ టీకా వేస్తారు.  నాలుగో రోజు విజయవాడ, గుంటూరు, కర్నూలు, విశాఖ, రాజమహేంద్రవరం, కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో టీకాకు దూరంగా ఉన్న వారిని గుర్తించి పంపిణీ చేసేలా జిల్లాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రత్యేక ప్రదేశాల్లో నివసించే సంచార జాతుల కుటుంబాలకు చెందిన పిల్లలకు పోలియో చుక్కలు పంపిణీ చేసేందుకు  ప్రత్యేక బృందాలును ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలోని  పరవాడ PHC, లో ఉదయం 8 గంటలనుండే  పల్స్ పోలియో కార్యక్రమం మొదలైనది. "నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించాల్సిన సమయం ఇది" అని  శ్రీ యం.ఎస్. సతీష్ కుమార్,MPHS, తెలిపారు. తమ సిబ్బంది ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీలు తో కలసి 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు.

 తెలంగాణలో కూడా నేటి నుంచే పోలియో చుక్కలు  పంపిణీ కార్యక్రమం  ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెుత్తం 38 లక్షల పైగా  లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ వైద్యారోగ్యశాఖ.

 

Add new comment

15 + 3 =