నెల్లూరు మేత్రాసనం, త్రిపురంతకం విచారణలో జాతీయ యువతా దినోత్సవము

ఆగస్టు 14, 2022న నెల్లూరు మేత్రాసనం, త్రిపురంతకం విచారణలో జాతీయ యువతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి . 

ఉదయం 10:30 గంటలకు స్వాగత నృత్యాలతో గురువులను ఆహ్వానించారు, విచారణ సహాయక గురువులు గురుశ్రీ ప్రదీప్ కుమార్ MSFS భక్తివంతమైన పాటల పూజను చేసారు. 

 "శ్రీసభలో యువతీయువకుల ప్రాధాన్యత, సువర్తసేవలో వారి భాద్యతను, ప్రస్తుత సమాజంలో ఎటువంటి సమస్యలకు మనం ఏ విధంగా మనవంతు కృషి చేయాలో "అని విచారణ గురువులు గురుశ్రీ సాగర్ సంతోష్ MSFS గారు తమ వాక్యోపదేశంలో బోధించారు. పూజలో ప్రత్యేక సమర్పణ ప్రార్ధనలు నిర్వహించారు. 

దివ్యపూజ అనంతరం విచారణ యువతీయువకులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

నిత్యసహాయమాత యూత్ కొంత డబ్బును వసూలుచేసి బియ్యం, మరియు ఒక నెలకు సరిపడా నిత్యావరసర సరుకులు కొనుగోలు చేసి ఎర్రగొండుపాలెంలో ఉన్న మానసిక రోగుల సంస్థకు ఇచ్చారు. అక్కడ వారితో కలిసి కొంత సమయాన్ని గడిపారు. ఈ సహాయానికి ఆ సంస్థ వారు కృతజ్ఞతలు తెలిపారు. 

సాయంత్రం విచారణలో చివరి ప్రార్ధనలోపాల్గొని దేవుని దీవెనలు పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొనిన అందరికి విచారణ గురువులు కృతజ్ఞతలు తెలిపారు.

"దాదాపు 65 మంది యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు" అని సహాయక గురువులు గురుశ్రీ ప్రదీప్ కుమార్ గారు RVA వారితో తెలిపారు.

MSFS సభ, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం ప్రొవిన్సుకు యువతా విభాగానికి డైరెక్టర్ గా గురుశ్రీ సాగర్ సంతోష్ MSFS గారు నియమితులైయ్యారని గురుశ్రీ ప్రదీప్ గారు తెలిపారు.

విచారణ సహాయక గురువులు మరియు నిత్యసహాయమాత యూత్ విచారణ గురువును సన్మానించి,అభినందించారు.

Add new comment

1 + 4 =