Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
నాకు ఆత్మహత్య చేసుకోవాలని వుంది
మనసు బాధగా ఉన్నప్పుడు మనకు ఇతరుల సహాయం మనకు ఎంతో అవసరం.అది స్నేహితుడు కావొచ్చు ,లేదా మన మనసుకు నచ్చినవారు కావొచ్చు . ఎవ్వరికీ చెప్పుకోలేని సమయం లో అది మనకు భారం గా తయారు అవుతుంది . మనసులో ఉన్నది ఎవరికైనా చెప్పుకుంటే ఆ భారం లేదా ఆ బాధ తగ్గుతుంది మరియు మన మనసు కుదుటపడుతుంది. సామెతలు 17:17 చెప్పినట్లు గా ఎల్లవేళలా ,ఆపద సమయములో అదరము తో, ప్రేమతో వుండే స్నేహితులు ,సోదరులు మనకు తోడుగా వుంటారు మరియు మనలను ఎప్పుడును ప్రేమిస్తుంటారు .
మీ మనసులో ఎటువంటి బాధ ఉన్నఈ క్షణమే మీ కుటుంబ సభ్యులతో గాని,నమ్మకస్తుడైన స్నేహితునితో గాని మాటాడండి .ఎందుకంటె వారు మనలను ప్రేమిస్తుంటారు .
దేవుని తో మాట్లాడండి :
కీర్తనలు 55:2 లో చెప్పినట్లుగా "నీ భారము ప్రభువు మీద మోపుము " .నిజమే కదా మన భారాలన్నిటిని తెసివేయగల దేవుడు మన ప్రభువు ఒకడే.
ఫిలిపియులు4:6 లో చెప్పినట్లుగా మనకు ఏమి ఐతే కావాలో వాటికోసం కృతజ్ఞత పూర్వకంగా ప్రార్దించినచో దేవుడు మనకు ఇస్తాడు .అలాగే 4:13 లో చెప్పినట్లుగా ఎటువంటి పరిస్థితులను లైన ఎదురుకోను శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు .ఈరోజే ప్రార్థన చేయండి ,ఎందుకంటె మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు .
యోబు జీవితం చూసినట్లు ఐతే తన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు, ఆయన పిల్లలందరూ చనిపోయారు. రోగం వచ్చింది. అందరు నిందించారు. తన సమస్యలంతటికి కారణం దేవుడే అని తప్పుగా మాట్లాడారు. అప్పుడు యోబు “నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది; ఇక బ్రతకాలని లేదు అని అనుకున్నాడు .అటువంటి పరిస్థితులలో యోబు దేవునికి ప్రార్థించాడు (యోబు 10:1-3) ఒక మంచి స్నేహితుడైన ఎలీహు యోబును సహాయపడ్డాడు , తన పరిస్థితి గురించి సరైన విధంగా ఆలోచించడానికి యోబుకు సహాయం చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా యోబు దేవుడు ఇచ్చే సలహాలను, సహాయాన్ని తీసుకున్నాడు.
నాకు చనిపోవాలని ఉంది అని "మీ ప్రాణ స్నేహితుడు " చెప్తే ఏం చేయాలి?
I am fine..... ఫైన్(Fine) అంటే అంత బాగానే వున్నట్టా ?? ఆతని మనుసును గ్రహించండి .ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నాయని మీ స్నేహితుడు చెప్తే తనతో ఎక్కువసమయం గడపండి . తన మనసులో ఉన్నదంతా చెప్పమనండి, అలా చెప్పేలా ఆయనకు సహాయం చేయండి. వాళ్లు చెప్పేది సహానుభూతితో వినండి.ఏమైనా నొప్పించే మాటలు మాట్లాడితే కోప్పడకండి, బాధపడకండి . ఓదారుస్తూ మాట్లాడండి .తనలో ధైర్యం నింపండి వాళ్లు ఆ ప్రయత్నం మానుకోవచ్చు.
ఓదార్పునిచ్చే కొన్ని బైబిల్ వచనాలు
యెషయా 41:9, 10, ఫిలిప్పీయులు 4:13, యాకోబు 4:8,ఫిలిప్పీయులు 4:6, 7,కీర్తన 31:7,కీర్తన 34:18.
ఆత్మాహత్యలు చేసుకున్న వారి ఆత్మలకు శాంతి కలగాలని . వారి కుటుంబాలకు ఓదార్పును దయచేయమని ఆ దేవాది దేవుని ప్రార్దించుదాము .
Source:యెహోవాసాక్షులు
Add new comment