దేవునితో ఒక రోజు - వైజాగ్ జీసస్ యూత్

విశాఖ అతిమేత్రాసనం, సెయింట్ జోసెఫ్ చర్చిలో "జీసస్ యూత్" వారు దేవుని తో ఒక రోజు రిట్రీట్ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ అతిమేత్రాసన యువత డైరెక్టర్ గురుశ్రీ ఆర్జి ప్రకాష్ గారు కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ సందర్భముగా గురుశ్రీ ఆర్జి ప్రకాష్ గారు మాట్లాడుతూ పునీతుల మధ్యవర్తిత్వం ఎందుకు తీసుకోవాలి అనే అంశం పై మాట్లాడారు . మరియు  పవిత్ర దివ్య పూజాబలి  యొక్క ప్రాముఖ్యతను యువతీ యువకులకు తెలియజేసారు.
వైజాగ్ జీసస్ యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  వైజాగ్ లో జీసస్ యూత్ ను ముందుండి నడిపిస్తున్న  శ్రీ గిరీష్ గారు ఈ కార్యక్రమం పాల్గొని  తన సహాయ సహకారాలను  అందించారు.

Add new comment

2 + 5 =