దేవమాత అంటే ఎంతో అభిమానం

ఈ మే నెలలో మనమందరము  కరోనా మహమ్మారితో గాయపడిన ప్రపంచం మొత్తం కొరకు,అలాగే ఇతర అవసరాలకొరకు  కలసి జపమాల జపించడం జరిగినది.  సెయింట్ ఆంథోనీ చర్చి, విజయనగరం  విచారణకు  చెందినటువంటి  మన సహోదరి షీబా(Sheeba) గారు కూడా ప్రతి రోజు దేవమాత సహాయం కొరకు ప్రార్ధించారు. ముఖ్యం గా విచారణ లో అవసరము లో ఉన్న వారి కొరకు, కరోనా తో బాధ పడుతున్నవారికొరకు  ప్రార్ధించారు. దీనికొరకు ప్రతి రోజు దేవమాతను అందంగా తయారు చేసి జపమాల చెప్పే సమయానికల్లా సిద్ధంగా ఉంచే వారు. పిల్లలకు, కుటుంబసభ్యులకు ప్రతి రోజు  పిలవకుండానే జపమాల కొరకు వచ్చేలా ఆ ప్రార్థన ప్రదేశాన్ని సిద్దపరిచే వారు. ఈ మే నెల  ప్రతి రోజు  ఆ దేవాది దేవునికి చేసే ప్రార్థనలో  మరియు జపమాల చెప్పేటపుడు  ప్రార్థన సహాయం కొరకు అందమైన  దేవమాతను ప్రేమతో సిద్దపరిచేవారు. ఎన్నో సార్లు తన కష్టాలలో, బాధలలో తనకు తోడుగా, సహాయం గా ఉన్న  దేవమాత అంటే ఎంతో అభిమానం అని తెలిపారు.

Add new comment

2 + 0 =