దుఃఖః దేవ రహస్యములు |Sorrowful Mysteries

జపమాల

దుఃఖః దేవ రహస్యములు (మంగళ, శుక్రవారములందు చెప్పవలెను)|

మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వరా! దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను పాత్రుడను గాక యుండినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను, దేవమాతకు స్త్రోత్రము గాను ఏబది మూడు పూసల జపము చేయుటకు మహా ఆశగా నున్నాను. ఈ జపము భక్తి తో చేసి పరాకు లేక ముగింప మీ సహయము నియ్యనవధరించండి.

సకల పుణ్యమూలకు విశ్వాసమనేడి పుణ్యము ఆస్థి భారమై యుండుట వలన ముందు ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొనుదుము గాక.

1) జేసు రక్తచెమటను చెమర్చుటను గురుంచి ధ్యానించుదము గాక
2) జేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురుంచి ధ్యానించుదము గాక
3) జేసునాథుని తిరుశిరస్సున ముండ్ల కిరీటము పెట్టి కొట్టుటను గురుంచి ధ్యానించుదము గాక
4) జేసు స్లీవను మోసుకొని పోవుటను గురుంచి ధ్యానించుదము గాక
5) జేసు స్లీవమీద కొట్టబడి మరణము పొందుటను గురుంచి ధ్యానించుదము గాక

 

Add new comment

3 + 9 =