దివ్య కారుణ్య జపమాల | Divine Mercy Chaplet | Family

దివ్య కారుణ్య జపమాల (మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన)

ప్రారంభము: సిలువ గురుతు, పరలోక జపము, మంగళ వార్త జపము, విశ్వాస సంగ్రహము

(ప్రతి దేవా రహస్యము ప్రారంభించుటకు ముందు పెద్ద పూస వద్ద ఈ క్రింది జపము చెప్పవలెను)

నిత్యుడగు పితయైన సర్వేశ్వరా! మీ డివ్య కుమారుడును, మా నాథుడైన యేసుక్రీస్తు శరీర రక్తములను, ఆత్మను, దైవ స్వభావమును , మా పాపముల, ప్రపంచములోని మానవులందరి పాపముల పరిహార్దము మీకు సమర్పించుచున్నాము. ఆమెన్.

(ప్రతి దేవరహస్యము యొక్క పది చిన్న పూసలపై ఈ క్రింది జపము చెప్పవలెను)

యేసునాథుని అతి బాధాకరమైన శ్రమలను చూచి మా మీదను, ప్రపంచములోని మానవులందరి మీదను మీ కరుణను చూపండి.

(ఐదు దేవా రహస్యములైన పిమ్మట ఈ ప్రార్థనతో ముగించవలెను)

పవిత్ర దేవా, పవిత్ర సర్వశక్తిమంతుడా, పవిత్ర నిత్యుడా! మా మీదను, ప్రపంచ మానవులందరి మీదను మీ కరుణను చూపండి. (మూడు సార్లు చెప్పవలెను)

అందరు: యేసు తిరుహృదయము నుండి ప్రవహించు దివ్య రక్తమా! జీవజాలమా! మిమ్ము ఆరాధిస్తున్నాను

. (మూడు సార్లు)

Comments

Praise the Lord today we r doing at 3pm for the purpose of corona virus

Add new comment

3 + 5 =