"తాతలు మరియు అమ్మమ్మ / నానమ్మ - వృద్ధుల దినోత్సవాన్ని" కొనియాడిన పునీత జాన్ మరియవీయాన్ని, బోయిగూడ విచారణ

మన ప్రాన్సిస్ జగద్గురువులు, జులై నెల 25వ తేదీని మొదటి ప్రపంచ తాతలు మరియు అమ్మమ్మ / నానమ్మ - వృద్ధుల దినోత్సవంగా కొనియాడాలని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అగ్రపీఠంలో గల, పునీత జాన్ మరియవీయాన్ని విచారణ, బోయిగూడ యందు  తాతలు మరియు అమ్మమ్మ / నానమ్మ - వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా కొనియాడారు.

విచారణ గురువులు గురుశ్రీ కే. చార్లెస్ గారు ప్రత్యేక దివ్యబలిపూజ అర్పించగా, పెద్దవాళ్ళు మనకు చేసిన అన్ని సహాయాలుకు కృతజ్ఞతలు అర్పించారు. ఆ విచారణ బాల బాలికలు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు పెద్దలను సంతోషపరిచారు.

మనమందరం కూడా మన అమ్మమ్మ, నానమ్మ, తాతల  యెనలేని ప్రేమ మరియు ఆప్యాయతలను గుర్తుతెచ్చుకొని ప్రతీరోజు వారికొరకు ప్రార్దిదాం.

Add new comment

1 + 0 =