Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
తల్లి పాలు: ఆరోగ్యవంతమైన రేపటి పౌరులకు పునాది
తల్లి పాలు: ఆరోగ్యవంతమైన రేపటి పౌరులకు పునాది
ఆగష్టు 1 నుండి ఆగష్టు 7 వరకు ప్రపంచమంతా తల్లి పాల వారోత్సవన్ని కొనియాడుతుంది. తల్లి పాల వల్ల బిడ్డలకు కలిగే లాభాలను ప్రపంచానికి తెలియజేయడానికి ఈ వారోత్సవాలను జరుపుతున్నారు.
ప్రతి బిడ్డ 4 నుండి 6 మాసాల వయస్సు వచ్చే వరకు తల్లి పాల త్రాగాలని, దాని ద్వారా పిల్లలు బలంగా మరియు తల్లులు ఆరోగ్యంగా ఉంటారని 1990 లో గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1992 నుండి ఈ వారోత్సవాలను ప్రపంచమంతటా ఆగష్టు మొదటి వారంలో నిర్వహిస్తున్నారు.
అప్పటినుండి ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలను ఒకొక్క ముఖ్య ఉద్దేశాలతో జరుపుతున్నారు. కాగా 2020 లోని వారోత్సవాల ముఖ్య ఉద్దేశం "చంటి బిడ్డల పోషణ పై వాతావరణ మార్పుల ప్రభావం మరియు ప్రపంచంలోని చంటి బిడ్డలు మరియు వారి ఆరోగ్యానికి తల్లి పాల ఆవశ్యకత".
పిల్లలకు తల్లి పాల ఆవశ్యకత మరియు ప్రాధాన్యతను గూర్చి ప్రపంచ దేశాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి.
మరి ప్రజలు తల్లిపాల ఆవశ్యకతను గూర్చి ఏమి చెప్తున్నారు?
బంగ్లాదేశ్ లోని శిల్పి అనే ఒక యువతి, తల్లి పాల వల్ల బిడ్డలకు నిమోనియా, కలరా మరియు కామెర్లు వంటి జబ్బులను పోరాడే శక్తిని ఇస్తుందని చెప్పింది.
తల్లి పాల వల్ల పిల్లలలో రోగాలను పోరాడే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా తల్లులు ప్రసవం తర్వాత పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల వారు అధిక బరువు కాకుండా మరియు రొమ్ము క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా నిరోధించుకోవచ్చు.
జీవితాలను కాపాడుతుంది కనుక అందరు తల్లులు తమ చిన్న బిడ్డలకు తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలని బంగ్లాదేశ్ కరిథాస్ మేనేజర్ అయిన లిలీ అంతనియా గోమెజ్ అన్నారు.
బిడ్డలకు తమ పాలు ఇవ్వడం తల్లుల బాధ్యత అని ఆమె చెప్పారు.
తల్లులు తాము పని చేసే చోట్ల కూడా పిల్లలకు పాలు ఇచ్చే అవకాశం ఉండేటట్లుగా చూసుకోవాలి.
తల్లి పాలు బిడ్డలకు నిజమైన పునాది వంటివి. కనుక చంటి బిడ్డలు ఆరోగ్యవంతమైన యువకులు గా మారడానికి తల్లి పాలు ఎంతో ఉపకరిస్తాయి అని ప్రపంచమంతా చాటి, రాబోయే తరాలు ఆరోగ్యంగా ఎదగడానికి మన వంతు కృషి చేద్దాం.
Add new comment