జాతీయ యువత డైరెక్టర్ల సమావేశం

జాతీయ యువత  డైరెక్టర్ల సమావేశం

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని 'నవింత' పాస్టోరల్ సెంటర్‌లో డియోసెసన్ యూత్ డైరెక్టర్ల సమావేశం జరుగుతోంది. లక్నో మేత్రాసన పీఠాధిపతి మహా పూజ్య  గెరాల్డ్ జాన్ మథాయిస్ గారి ఆధ్వర్యంలో పవిత్ర దివ్యపూజాబలి తో  సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి 88 మంది యువత  డైరెక్టర్లతో పాటు ఇతర సమన్వయకర్తలు, జాతీయ నాయకులు హాజరయ్యారు. మహా పూజ్య డాక్టర్ గెరాల్డ్ జాన్ మథాయిస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మహా పూజ్య  డాక్టర్ గెరాల్డ్ జాన్ మథాయిస్ గారు మాట్లాడుతూ దేవుని మార్గంలో పయనిస్తూ ప్రభు సేవలో ముందుకు వెళ్లాలని సూచించారు  మరియు “క్రిస్టస్ వివిట్”  గురించి వివరించారు.

అనంతరం జాతీయ కార్యకలాపాల నివేదికను ICYM మరియు YCS/YSM సమర్పించాయి. శ్రీ  ఆంటోనీ జూడీ (ICYM జాతీయ అధ్యక్షుడు) మరియు శ్రీమతి అషితా జిమ్మీ (YCS/YSM ప్రధాన కార్యదర్శి) జాతీయ యువజన డైరెక్టర్ మరియు CCBI యూత్ కమిషన్ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శికి నివేదికలను సమర్పించారు. తెలుగు ప్రాంతీయ యువత డైరెక్టర్ గురుశ్రీ సగిలి ప్రవీణ్ గారు, హెదరాబాద్ యువత డైరెక్టర్,  గురుశ్రీ సునీల్ కుమార్ గారు, విశాఖ అతిమేత్రాసన యువత డైరెక్టర్  గురుశ్రీ ఆర్జి ప్రకాష్ గారు  మొదలగువారు మన తెలుగు రాష్ట్రాలనుండి పాల్గొన్నారు.

సాయంత్రం లక్నో మేత్రాసన  యువత, లక్నో మరియు ఉత్తరప్రదేశ్ సంస్కృతిని ప్రదర్శించే సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి బరేలీ పీఠాధిపతి  మరియు CCBI యూత్ కమిషన్ సభ్యులు  మహాపూజ్య  ఇగ్నేషియస్ డిసౌజా గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ్యులు  తమ అభిప్రాయాలను, సలహాలను  తెలియజేశారు.

 

Add new comment

5 + 6 =