Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
జాతీయ భద్రతా దినోత్సవం :
జాతీయ భద్రతా దినోత్సవం :
పనిచేసేందుకు వెళ్ళినవారు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారో రారో అన్న ఆందోళనతో కుటుంబసభ్యులు బతకాల్సి వస్తుంది. కుటుంబ పెద్దకు ప్రమాదము జరిగినా, ప్రమాదములో మరణించినా ఇక ఆ కుటుంబము మొత్తము కోలుకోని విధంగా దెబ్బతుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భద్రతను పాటించాలి. ప్రతీ కార్మీకుడు తాను తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే, సూచించిన పద్దతులను పాటిస్తే ప్రమాదాలు సంభవించవు.
ఉద్యోగులు, సామాన్య ప్రజలు తమ జీవనవిధానంలో, వృత్తుల్లో భద్రత, ఆరోగ్య రక్షణను ఒక అంతర్గత భాగంగా మలుచుకునేలా వారిలో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవం ముఖ్య లక్ష్యం. 1972 నుంచి ప్రతీ సంవత్సరం మార్చి 4 న జాతీయ భద్రతా దినోత్సవం (National Safety Day) ను జరుపుకుంటారు. భారత ప్రభుత్వపు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ (Ministry of Labour and Employment) 1966 మార్చి 4 వ తేదీన జాతీయ భద్రతా మండలి (National Safety Council) ని స్థాపించింది. జాతీయ భద్రతా మండలి (National Safety Council) ప్రధాన కార్యాలయం ముంబై లో ఉంది. కార్మికుల భద్రత గురించి చర్చ అక్కడ మొదలైనది . 1962 లో జరిగిన రాష్ట్ర కార్మిక శాఖామంత్రుల సమావేశములో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ఆంశాలమీద చర్చ జరిగింది .
Add new comment