జాతీయ బాలికా దినోత్సవం (National Girl Child Day)

సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై అవగాహన కల్పించడం జాతీయ బాలికా దినోత్సవం (National Girl Child Day) యొక్క ముఖ్య లక్ష్యం. ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు, కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది.

ఇందిరా గాంధీ మొదటిసారి ప్రధానమంత్రిగా 1966 జనవరి 24 న ప్రమాణ స్వీకారం చేసిన రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 24 వ తేదీన జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

 

Add new comment

1 + 1 =