జాతీయ కథోలిక యువతా సదస్సు

కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా (CCBI) వారి ఇండియన్ కథోలిక యువతా మూవ్‌మెంట్ 4వ జాతీయ సమావేశాన్ని గుజరాత్‌లోని నదియాడ్‌లోని పాస్టోరల్ సెంటర్, నదియాడ్, గుజరాత్ ఏప్రిల్ 26 నుండి 1 మే 2022 వరకు నిర్వహించింది. 

దేశం నలుమూలల నుండి నాలుగు వందల ముప్పై ఏడు మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 'యూత్ ఫర్ ఎ సినడల్ చర్చి' అనే  నేపథ్యంపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

కొట్టార్ పీఠాధిపతులు మరియు CCBI యూత్ కమీషన్ అధ్యక్షులు మహా పూజ్య.సూసై నజరేన్ గారు దివ్యపూజబలితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది . 

మహా పూజ్య.అథనాసియస్ రెత్నా స్వామి గారు, గురుశ్రీ డాక్టర్ స్టీఫెన్ అలత్తర, CCBI డిప్యూటీ సెక్రటరీ జనరల్‌తో పాటు, మేత్రాసన గురువులు మరియు యూత్ డైరెక్టర్‌లు సమిష్టి దివ్యబలి పూజను అర్పించారు. 

హైదరాబాద్ అగ్రపీఠంకు చెందిన యూత్ కమిషన్ మహిళా ప్రతినిధి శ్రీమతి రెజీనా హనీషా రాజ్, జాతీయ కార్యనిర్వాహక కమిటీ (NEXCO) సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

సమావేశంలో యువకులకు సంబంధించిన వివిధ అంశాలపై శిక్షణా కేంద్రాలు మరియు సినడె నేపథ్యంపై సముహ చెర్చలు జరిగాయి.

పర్యావరణం, పేదరికం, వ్యసనాలు, యువత అశాంతి, మతతత్వం మొదలైన సామాజిక సమస్యల పరిష్కరించడానికి చురుకుగా పాల్గొన్నారు... ధర్మం, న్యాయం, శాంతి మరియు సామరస్యం ఉన్న మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో భారతదేశంలోని యువజన నాయకులు సమర్థవంతంగా పనిచేయడానికి ఈ సమావేశం సహాయపడుతుంది.

ఏప్రిల్ 30వ తేదీన వివిధ ప్రాంతాలకు చెందిన 17 మంది యువకులకు ఉద్యమం పట్ల నిస్వార్థ సేవలందించినందుకుగానూ పురస్కారాలు అందజేసారు. ఆనంద్ భట్నాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశం 1 మే 2022న ముగిసింది. 

యువతా కమిషన్ అధ్యక్షుడు మారియో కెవిన్‌ గారితో పాటు మేత్రాసన యువతా డైరెక్టర్ గురుశ్రీ రిచర్డ్ జాన్ గారు, జనరల్ సెక్రటరీ లియోనా ఆగ్నెస్ మరియు రెజీనా హనీషా రాజ్ - మహిళా ప్రతినిధి NYC 2022లో హైదరాబాద్ అగ్రపీఠ ప్రాతినిధ్యం వహించారు. 

"ఈ సమావేశం మా అందరికీ అద్భుతమైన అనుభవాని, క్రొత్త విషయాలు నేర్చుకునే  అవకాశం ఇచ్చింది. భారతదేశం అంతటా ఉన్న యువతా ప్రతినిధులతో సంభాషించే అవకాశాన్ని కలగచేసింది" అని ఫాదర్ రిచర్డ్ జాన్ గారు అన్నారు .

Add new comment

5 + 8 =