ఘనం గా బాలల హక్కుల దినోత్సవాన్ని జరుపుకున్న చిన్నారులు

దక్షిణ కంబోడియా,  టేకో ప్రావిన్స్‌లో చోమ్‌కార్‌చెయాంగ్ గ్రామంలోని అవర్ లేడీ ఆఫ్ ది స్మైల్ కథోలిక  దేవాలయం నందు  జూన్ 25న బాలల హక్కుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. సుమారు  600 మంది పిల్లలు బాలల హక్కుల దినోత్సవానికి హాజరయ్యారు.  

బిషప్ ఒలివర్ ష్మిత్థ్యూస్లర్ MEP, గారు మాట్లాడుతూ తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు, పాఠశాలకు వెళ్లి  చదువుకునే హక్కు, సరిపడా ఆహారం పొందే హక్కు వంటి వారి హక్కులను అర్థం చేసుకునేలా పిల్లలకు మార్గనిర్దేశం చేయడం మంచిదని ఆయన  అన్నారు.  బాలల హక్కులు వారి మంచి భవిష్యత్తును చూసేందుకు మార్గనిర్దేశం చేస్తాయని బిషప్ గారు తెలిపారు.

ట్రాపెయాంగ్ అంపిల్ గ్రామానికి చెందిన నిక్రోథెరామ్ ప్రాథమిక పాఠశాలలో 12 ఏళ్ల విద్యార్థిని "థు రాడి"(Thu Rady) మాట్లాడుతూ  ఈ  కార్యక్రమం ద్వారానే   పిల్లల హక్కుల గురించి తెలుసుకోగలిగాను,  ఐదు రకాల పిల్లల హక్కులు  ఉన్నాయని నేను గుర్తుంచుకున్నాను  అని రాడి చెప్పారు.

అంగ్ టా న్గిల్ గ్రామంలోని వాట్ నిక్రోట్ ప్రాథమిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న న్హెక్ హౌయ్(Nhek Houy) మాట్లాడుతూ, ఇది పిల్లలను సంతోషపరిచే కార్యక్రమం అని ,సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, పిల్లల హక్కులు, పురుషుల హక్కులు, మహిళల హక్కులను అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని,  ఇలాంటి  కార్యక్రమంలో  పాల్గొనమని నా స్నేహితులను కోరుతున్నాను అని ఆ బాలుడు తెలిపాడు .

చోమ్‌కార్‌చెయాంగ్ కమ్యూనిటీలోని అవర్ లేడీ ఆఫ్ ది స్మైల్ కథోలిక విద్యార్థులు విద్య మరియు వినోదం కోసం ప్రతి వారం సమావేశానికి 300 నుండి 500 మంది వరకు పిల్లలు హాజరవుతారు.

 

 

 

Add new comment

1 + 6 =