ఘనంగా " CCBI జాతీయ యువత నాయకుల" శిక్షణ కార్యక్రమము

ఘనంగా " CCBI జాతీయ యువత  నాయకుల"  శిక్షణ కార్యక్రమము

మూడురోజుల "జాతీయ యువత  నాయకుల"  శిక్షణ కార్యక్రమము ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమం డాన్ బాస్కో టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్, ఓఖ్లా, న్యూఢిల్లీలో శుక్రవారం 3 మార్చి 2023న పార్రంభమైనది.  ఢిల్లీ అగ్రపీఠాధిపతులు   మహా పూజ్య  అనిల్ జోసెఫ్ థామస్ కౌటో, సెక్రటరీ జనరల్, CCBI ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ  మూడు రోజుల శిక్షణా కార్యక్రమానికి సిసిబిఐలోని 11 ప్రాంతాల నుండి 60 మంది యువజన నాయకులు హాజరయ్యారు.
ప్రారంభ దివ్య పూజాబలి లో ఒక చిన్న పరిచయంతో ప్రారంభమైంది, తరువాత మహా పూజ్య   అనిల్ కూటో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో గురుశ్రీ  చేతన్ మచాడో, CCBI యూత్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, శ్రీ అభిషేక్ భట్టాచార్జీ, YCS/YSM ఇండియా కోఆర్డినేటర్, శ్రీమతి జ్యోతి, వైస్ ప్రెసిడెంట్, ICYM మరియు శ్రీమతి అంజలి పాల్గొన్నారు.

మహా పూజ్య  అనిల్ జోసెఫ్ థామస్ కౌటో గారు మాట్లాడుతూ  "నిజమైన  స్ఫూర్తితో సమాజానికి మరియు శ్రీసభకి నిస్వార్థమైన  సేవ చేయడానికి నాయకులు కట్టుబడి ఉండాలని ఉద్బోధించారు. నాయకులు  ఎల్లప్పుడు ప్రార్థనలో ఉంటూ పరిశుద్ధాత్మ నుండి వచ్చే దైవిక జ్ఞానాన్ని అనుసరించాలని అతను యువ నాయకులను అభ్యర్ధించారు.

బరేలీ పీఠాధిపతులు మహా పూజ్య ఇగ్నేషియస్ డి'సౌజా, CCBI యూత్ కమిషన్ ఛైర్మన్ మరియు CCBI యూత్ కౌన్సిల్ ఛైర్మన్ ఆదివారం నాడు 5 మార్చి 2023న దివ్య పూజాబలి ని సమర్పించారు.

గురుశ్రీ  డాక్టర్ స్టీఫెన్ అలతర, డిప్యూటీ సెక్రటరీ జనరల్, CCBI, గురుశ్రీ చేతన్ మచాడో, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, CCBI యూత్ కమిషన్, గురుశ్రీ  అనిల్  ఎస్.డి.బి. మరియు శ్రీమతి అనస్తాసియా నీల్ పింటో వివిధ శిక్షణా సమావేశాలకు నాయకత్వం వహించారు.దివ్యబలిపూజ , దివ్య సత్ప్రసాద  ఆరాధన, శిలువ మార్గం, ధ్యానం మరియు ఓరియెంటేషన్ చర్చల ద్వారా శిక్షణా కార్యక్రమం ఆధ్యాత్మిక  వాతావరణంలో ఘనంగా జరిగింది.

Add new comment

13 + 6 =