కుటుంబ శ్రీసభ - సినడాలిటి సదస్సు

ఏలూరు మేత్రాసనం ,సెయింట్ జోసఫ్స్ దంత కళాశాలలో కుటుంబ శ్రీ సభ - సినడాలిటీ సదస్సును నిర్వహించారు.జాతీయ CBCI కుటుంబ విభాగం కార్యదర్శి గురుశ్రీ మిల్టన్ గారు ముఖ్య అతిధిగా సదస్సును నిర్వహించారు.

సదస్సులోని  ప్రధానమైన అంశాలు   
1.పరిశుద్ధ పాపుగారు తాను రాసిన "ప్రేమానందం" అనే విశ్వలేఖలో - "కుటుంబ శ్రీ సభను " గూర్చి తెలియజేసారు.
2.కుటుంబ జీవితంలో రెండు మాటలు ఉన్నాయి 
  (i)నిందించటం  (ii) కాపాడటం 
౩.శ్రీ సభ - మంచి కుటుంబ సంబందాన్నిఎలా పెంపొందించాలి అనే అంశాలను తెలియజేసారు.
4. కుటుంబ వ్యస్థలో ఆధ్యాత్మికతను చూడాలి.
5.కుటుంభం శ్రీ సభ -ప్రాథమికమైన విభాగం .
6.కుటుంభం ప్రాముఖ్యత ,విలువలను తెలియజేయుట కుటుంభం శ్రీ సభ యొక్క ప్రధాన బాధ్యత.
7.కుటుంబం - ఒక దైవ వరం.
8.కుటుంబానికి సువార్తను అందించగలిగితే విశ్య శ్రీ సభను ముందుకు నడిపిస్తుంది.
9.వారానికి ఒకసారి కుటుంబ సభ్యులందరు కలిసి మాట్లాడుకోవాలి.
10.ప్రతి కుటుంబం- స్థానిక శ్రీసభ 
11.సహభాద్యతతో శ్రీసభను - నూతన పరచాలి
12.కుటుంబ శ్రీసభ, గురువులు కలసి - దైవపిలుపులను ప్రోత్సహించాలి  
13.కుటుంబాలు కుటుంబాలు కలుసుకోవాలి, సహాయం చేయాలి, వారి అవసరాలు తెలుసుకోవాలి చేయూత నియాలి.
14.పెద్దవారిలో ఉన్న ఒంటరితనాన్ని తొలగించాలి.
15.కుటుంబసభ్యులందరు కలసి మాట్లాడుకోవాలి, కలసి జీవించాలి
16.మేత్రాసనంలో "వివాహ సిద్ధపాటు సదస్సులు, దంపతుల సదస్సులు నిర్వహించాలి  
17.శ్రీసభ అనుభవం ఉన్న ప్రతిభావంతులైన దంపతుల యొక్క సేవలు ఉపయోగించుకోవాలి.
18.మేత్రాసన, విచారణ, గ్రామస్థాయిలలో కుటుంబ సెల్స్  ఉండాలి.

ఫాదర్ మిల్టన్ గారికి బిషప్ గారు వందనాలు తెలియచేశారు

Add new comment

12 + 4 =