కానుక సమర్పణ ఆదివారం

కానుక సమర్పణ ఆదివారం

 కడప మేత్రాసనంలోని సువార్త నిలయం (pastoral centre) లో20 ఫిబ్రవరి 2022 న విచారణలోని  పిల్లల కోసం ప్రత్యేక దివ్యబలిపూజను నిర్వహించారు.

 "కానుక సమర్పణ ఆదివారం " అనేది ఈ ప్రత్యేక దివ్యబలిపూజ యొక్క నేపధ్యం.
ఉదయం 8:30 గంటలకు దివ్యపూజను ప్రారంభించి,పిల్లలతో ఊరేగింపు, ప్రసంగం చెప్పిన  తరువాత
పిల్లలను బలిపీఠానికి అర్పించారు (తల్లిదండ్రులు పిల్లలను తీసుకువస్తారు మరియు వారిని  దేవునికి అర్పిస్తారు), గురువులు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలను వారి తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వడం జరిగింది.
 50 మంది చిన్నారులతో పాటు దాదాపు 250 మంది విశ్వసులు దివ్యపూజకు హాజరయ్యారు. పిల్లలకు  బహుమతులను అందించి వారికి దివ్యబలిపూజ ఉద్దేశ్యం తెలిపారు.
దేవాలయంలో పిల్లలకు ఉన్న ప్రాముఖ్యత, పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వడం తల్లిదండ్రుల బాధ్యత అనే అంశాల పై  అవగాహన ఇచ్చారు.

మొదలగు కార్యక్రమాలగురించి  కడప మేత్రాసనం, సువార్త నిలయం డైరెక్టర్   గురుశ్రీ  సతీష్  గారు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి పూజకు విచ్చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Add new comment

1 + 0 =