కలకత్తా అగ్రపీఠంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023

కలకత్తా అగ్రపీఠ మహిళా కమిషన్ మరియు కౌన్సిల్ ఆఫ్ కాథలిక్ ఉమెన్ ఆఫ్ ఇండియా సభ్యులు సంయుక్తంగా మార్చి 5న కలకత్తా, పార్క్ సర్కస్, క్రీస్తురాజు దేవాలయము నందు 2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

2023 సంవత్సరానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ నినాదం "డిజిట్ఆల్: జెండర్ సమానత్వం కోసం ఆవిష్కరణలు, సాంకేతికత".

కలకత్తా అగ్రపీఠాధిపతులు మహా పూజ్య థామస్‌ డిసౌజా అధ్యక్షతన వికార్‌ జనరల్‌ గురుశ్రీ డొమినిక్‌ గోమ్స్‌, గురుశ్రీ బాసిల్‌ మండి గార్లు కలిసి దివ్యబలిపూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పీఠాధిపతుల వారు మాట్లాడుతూ, "దేవుడు స్త్రీ మరియు పురుషులను సమాన గౌరవం మరియు హక్కులతో సృష్టించాడు; ఎవరూ మరొకరి కంటే గొప్పవారు కాదు. ఆడపిల్లలందరికీ సరైన విద్యను అందించడం ద్వారా తమను తాము శక్తివంతులను చేసుకుంటారు."

వివిధ విచారణలకు చెందిన మహిళలు రకరకాల పాటలు, స్కిట్,  జానపద నృత్యాలతో కార్యక్రమం ముగిసింది.

కలకత్తా అగ్రపీఠం నుండి 500 మంది మహిళలు మరియు క్రొయేషియా నుండి ఇద్దరు అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Add new comment

7 + 8 =