కరోనా లేని ప్రపంచాన్ని చూడాలని ఆశపడుతున్నారా?

 

 కరోనా లేని ప్రపంచాన్ని చూడాలని ఆశపడుతున్నారా? ఈ వ్యాధులు, బాధలు, మరణం లేకపోతే బావుంటుందని అనుకుంటున్నారా? ఏ ఆందోళనలు లేని రోజుల కోసం ఎదురుచూస్తున్నారా? కరోనా లేని  ప్రాంతంలో జీవించాలని కోరుకుంటున్నారా?

మనుషులు జీవితాంతం  ప్రశాంతకరమైన, సంతోషకరమైన పరిస్థితుల మధ్య జీవించేలా మన  ప్రేమగల దేవుడు ఈ అందమైన భూమిని  సృష్టించారని మర్చిపోకండి.

కేవలము దేవుని  కృపావల్లే మనము బ్రతికి ఉన్నామని నమ్మండి. అయన కనికరము, కృప మన చుట్టూ  ఉంది. మన సృష్టికర్తకు మనమీద ఎంతో ప్రేమ ఉంది.
సూర్యుని లేని భూమిని మనం ఊహించుకోగలమా?  సూర్యుని శక్తితోనే చెట్లు ఆకుల్ని, పువ్వుల్ని,పండ్లని మనకు ఇస్తున్నాయి. అలాగే వర్షం మనకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వరం. ఈ వర్షంల వల్లే  భూమ్మీద పంటలు పండుతున్నాయి కదా ?
మత్తయి 6:26. లో చూసినట్లు అయితే ఆకాశమున సంచరించు పక్షులను దేవుడు చూడమంటున్నారు, అవి విత్తనములు నాటుట లేదు, పంటలను కోయవు, గిడ్డంగులలో ధాన్యము  పోగుచేసుకోవు, అయినా  పరలోకమందున  తండ్రి వానిని పోషించుచున్నాడు.  మనము  వాటికన్నా విలువైనవాళ్లుము అని దేవుడు చెపుతున్నారు.

దేవునికి మనమీద చాలా ప్రేమ ఉంది. మన చేయాల్సింది అంత దేవుని వైపు తిరగడమే. తన మాట వినే పురుషులను, స్త్రీలను, పిల్లలను, అందర్నీ చుట్టూ దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దీవించాలని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకంటే మన ప్రభువు ప్రేమమయుడు.

ఈ లోకంలో అందరూ నిన్ను విడిచిన, కరోనా ఉంది అని నువ్వు ప్రేమించే వాళ్ళు నిన్ను విడిచిన, నిన్ను విడువని వారు ఎవరైనా వున్నారంటే అది మన ప్రభువు ఒక్కరే.
ఒక ప్రేమగల తండ్రిలా, తన పిల్లలమైన మనలను ఆయన పోషిస్తున్నాడు అని మర్చిపోకండి. మత్తయి 6:8లో చెప్పినట్లుగా మనము  అడగకముందే మనకు ఏమి కావాలో మన తండ్రి అయిన దేవునికి తెలుసు. ఈ కరోనా మహమ్మారి నుండి మనలను రక్షించాలని ఆ దేవాది దేవుని ప్రార్దించుదాం.

 

Add new comment

7 + 5 =