ఐక్యత యొక్క స్ఫూర్తి

ఐక్యత యొక్క స్ఫూర్తియూనిఫెస్ట్   - 2022

ఐక్యత యొక్క స్ఫూర్తి

యూనిఫెస్ట్   - 2022 

26 ఫిబ్రవరి 2022న, హైదరాబాద్ అతి మేత్రాసనంలోని, బేగంపేట్ విచారణలో గల హోలీ ట్రినిటీ దేవాలయం నందు యువతీయువకుల కోసం యూనిఫెస్ట్ ను నిర్వహించారు. ఐక్యత యొక్క స్ఫూర్తిని కొనియాడటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.

హైదరాబాద్ అగ్రపీఠాధిపతి  మహాపూజ్య పూల ఆంథోని తండ్రిగారు  విచ్చేసి పతాక ఆవిష్కరణ  మరియు జ్యోతిప్రజ్వళనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూల ఆంథోని గారు మాతడుతూ యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసి ఆ ప్రతిభను కథోలిక విశ్వాససేవలో ఉపయోగించుకోవటమే ఈ కార్యక్రమం అని తెలియజేసారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రిటైర్డ్ IPS అధికారి శ్రీమతి అరుణ బహుగు గారు విచ్చేసారు. విచారణ గురువులు గురుశ్రీ రాజు అలెక్స్ గారు, సహాయక గురువులు గురుశ్రీ సతీష్ గారు , హైదరాబాద్ యూత్ డైరెక్టర్ గురుశ్రీ రిచర్డ్ జాన్ గారు ,సిస్టర్ ఫ్రాంసిన గారు, గురుశ్రీ జోజి గారు కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమం సాంస్కృతిక మరియు  సృజనాత్మక ప్రతిభా సంబురం మాత్రమే కానీ పోటీ కాదని, కేవలం యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయటమే కార్యక్రమంలోని అంతరార్ధం అని గురుశ్రీ రిచర్డ్ జాన్ గారు అన్నారు.

కార్యక్రమంలో భాగంగా యువతలలోని ఐక్యత, యువత మరియు మహిళలో సాధికారత , నృత్యాలు,నాటకాలు, బృంద గానాలు మొదలగు వినోద కార్యక్రమాలను నిర్వహించారు.హైదరాబాద్ యూత్ ప్రెసిడెంట్ మారియో కెవిన్ గారు విచ్చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయసారు మరియు యువత అనునిత్యం దేవునియందు మెలగాలని కోరారు. 

Add new comment

2 + 10 =