ఉత్తరించు ఆత్మల పండుగ

ఉత్తరించు ఆత్మల పండుగAll Souls' Day

సకల మృతుల పండుగ లేదా ఉత్తరించు ఆత్మల పండుగ

మరణించిన ఆత్మలు ఉత్తరించు స్థలము నుండి దేవుని చంతకు చేరుటకు మన ప్రార్ధనా సహాయం అవసరం.

మరణించిన ప్రతిఒక్కరి ఆత్మ పరలోకానికి వెళ్లకుండా ఉత్తరించు స్థలములో ఉంటుంది. ఆ ఆత్మలు తమకు తాముగా ఎటువంటి సహాయం చేసుకోలేని స్థితిలో ఉంటాయి. అటువంటి ఆత్మలు పరలోకంలో ఆ దేవదేవుని సన్నిధికి చేరాలంటే ఆ ఆత్మలకోసం ప్రార్ధన చెయ్యాలి. తమకుతాముగా ప్రార్ధించుకోలేని ఆ ఆత్మల కోసం మనం ప్రార్ధించే రోజే ఈ ఉత్తరించు ఆత్మల పండుగ.

ఈ ఉత్తరించు స్థలంలోని ఆత్మలకు స్వయం సహాయం, అరే ఆత్మలకు సహాయం చేసే శక్తి ఉండదు. అందుకే వారిని దిక్కులేని ఆత్మలు అంటాం. కాని పరలోకంలో నివశిస్తున్న ఆత్మలు, భూలోకంలో జీవిస్తున్న మానవులు పని ప్రార్థించి బ్రతిమాలుకొని ఆయా ఉత్తరించు ఆత్మల బాధామయ కాలాన్ని తగింప కలిగేలా చేయనగును. క్షమింపబడదగిన పాపాలన్నీ పరిహరింపబడి, అందుకు తగిన బాధలన్నీ భరించి ఈ ఉత్తరించు ఆత్మలు ప్రక్షాళణ అయిన పిమ్మట మాత్రమే విముక్తి అభించి దేవుని రాజ్యంలోకి ప్రవేశింప కలుగుతాయి. వారి పాప విమోచనకై తగిన స్వల్ప కాలిక శిక్ష ముగించుకొని పశ్చాత్తాపాన్ని పొంది పాపబంధం నుండి ఉత్తరించు స్థితినుండి విడుదలైన పిమ్మట దేవుని కృపవల్ల పరిశుద్ధత పరిపూర్ణత అభించి దేవయిష్ట ప్రసాదం కలిగి ఆ యాత్మలు మోక్షం చేరుకోగలుగుతాయి. కనుక ఉత్తరించు స్థలంను శుద్దీకరణ స్థలం, ప్రాయశ్చిత్త స్థలం అని పిలువదగును.

5వ శతాబ్దం నుండే ఈ ఉత్తరించు ఆత్మలు నిత్య విశ్రాంతి పొందుటకై ప్రార్థనలు దివ్యబలి పూజలు అర్పించే సంప్రదాయం ఉంది. కాని 'పునీత క్లూని ఒడిలో' వారి కృషివల్ల 10వ శతాబ్దం నుండి ఈ సంప్రదాయం ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది. జై తగిన స్వల్ప కాలిన రాజ్యంలోకి ప్రవేశ ప్రక్షాళణ అయిన విశ్రాంతికోసంను, రెం పొత్తు తలంపుల నెరవ మొదటి ప్రపంచయుద్ధంలో అసంఖ్యానమైన సైనికులు ప్రజలు ప్రాణాలు లారు. ఈ సందర్భంగా క్రీ॥శ॥ 1915లో 15వ బెనెడిక్టు పోపుగారు ప్రతి గురువు కొత్తిరించు ఆత్మల పండుగరోజున మూడు దివ్యబలిపూజలు చేయ అనుమతి "రుచేశారు. మొదటి పూజ వేదనలనుభవిస్తున్న ఉత్తరించు స్థల ఆత్మల నిత్యసంను, రెండవ పూజ పరిశుద్ధ జగద్గురువు పోపుగారి ప్రత్యేక మరియు

పుల నెరవేర్పుకు, మూడవది మరియు ఆఖరి పూజకు గురువు యొక్క కొరకును అర్పింప సెలవిచ్చారు. ఈ పూజలు అర్పించుటకు సొంత తలంపు కొంత ముందు చనిపోయిన ఆయా వ్యక్తుల పేర్లు చెప్పి వారి ఆత్మల నిత్య విశ్రాంతిని మని, ఉత్తరించు స్థలంనుండి విమోచింపుమని ప్రభువును వేడుకొంటు గురువు." పూజలు సమర్పింప సెలవు పొందియున్నారు. కతోలిక ఆచారము చొప్పున విశ్వాసుల విన్నప ప్రార్థనలు సల్పుట, సమాధులు స్థలాన్ని సందర్శించి ప్రత్యేక జపాలు, పాటలు మధ్య తీర్థజలాలతో సమాధులను ఆశీర్వదించడం జరుగుతుంది. కొన్ని దేశాల్లో విశ్వాసులు, ప్రదక్షిణగా సాయంకాలం సమాధుల వద్దకువెళ్లి ప్రార్థనలు చేసుకుంటు కొవ్వొత్తులు, దీపాలు వెలిగిస్తారు. అవి వెలిగినంత సేపు రాత్రుళ్లు సందర్బోచిత గుర్తుగా వెలుగుతూనే ఉంటాయి.

ఉత్తరించెడి దిక్కులేని ఆత్మల విముక్తికోసం భక్తి ప్రదర్శించడంను ఒక గొప్ప క్రైస్తవ దాతృత్వంకు గుర్తుయని ప్రజలు కీర్తిస్తుంటారు. ఈ విషయంలో పునీత లియోనార్డుగారు “ఉత్తరించు స్థలంనుండి ఒక ఆత్మను నీవు విముక్తం చేయకలిగితే ఇక మోక్షం నీ చేతిలో ఉందని నమ్ము" అని బల్లగుద్ది చెప్తున్నారు. చనిపోయిన వార్లను ప్రార్థనా పూర్వకంగా మనం జ్ఞాపక పరచుకుంటే, దేవుడు మన తలంపును ఆశాభావాన్ని బలపరుస్తాడు. తద్వారా మనలను వీడిన మన సహోదరీ సహోదరులు క్రీస్తు పునరుత్థాన భాగ్యలో తప్పక పాలుపంచుకొంటారు.

“ఏసుప్రభుని దివ్య జ్ఞాన శరీరమైన భూలోక శ్రీసభ మరణించినవారిపట్ల పూర్తి గౌరవంతో ఘనంగా స్మరించుకుంటుంది. భక్తితో మరణించినవారు యోగ్యమైన బహుమతిని పొందుదురని నమ్ముతుంది. నమ్మి ప్రార్థించినచో ఆ ఆత్మలు పాపవిముక్తి పొందుదురు. (2 మక్క. 12:45) అని విశ్వసిస్తుంది. తన కష్టాలు శ్రమలు అన్నీ ఆ దిక్కులేని ఆత్మలకోసం సమర్పించుకుంటుంది." అని 2వ వాటికను కౌన్సిలు మనవిచేసింది.

Add new comment

3 + 11 =