ఇంట్లో కరోనా రోగులు ఉన్నారా?

కరోనా సెంకడ్‌ వేవ్‌ ఉధృతి వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మన కుటుంబంలోనే ఎవరైనా వైరస్‌ బారిన పడితే ఎటువంటి  జాగ్రత్తలు తేసుకోవాలో తెలుసుకందాం. మన కుటుంబం లో ఎవరికైనా పాజిటివ్‌ వచ్చినపుడు కంగారు పడకుండా, భయాందోళనకు గురికాకుండా జాగ్రత్తగా ఆలోచించాలి. మన ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకుంటూనే, వైరస్‌ బారిన పడిన వారిని కూడా చికిత్స అందించవచ్చు.

  1. ఇంట్లో ఉన్న ప్రతిఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా వాడాలి.
  2. ముందుగా వైరస్‌ బారిన పడిన వారిని ప్రత్యేక గదిలో ఉంచాలి. వారికంటూ ప్రత్యేక బెడ్ మరియు వస్తువులను పెట్టండి.
  3. వారు వాడిన పడేసిన వస్తువులను ప్రత్యేకమైన డిస్టబిన్  లేదా బయో హజర్డాస్‌ బాక్స్‌లో వేయాలి.
  4. కరోనా బారిన పడిన వ్యక్తి దుస్తులను విడిగా క్రిమిసంహారక మందుతో శుభ్రం చేయాలి.
  5. కరోనా బారిన పడిన వారికీ డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూనే మంచి ఆహారాన్ని టైం కి ఇవ్వాలి.
  6. కరోనా బారిన పడిన వ్యక్తి ఎప్పటికపుడు స్టీమ్(ఆవిరి) పడుతూ ఉండాలి.
  7. ఇంట్లో ప్రత్యేక టాయిలేట్‌ సదుపాయం లేనట్టు అయితే  తరచూ క్రిమిసంహారక మందులతో శుభ్రం చేస్తూ ఉండాలి.
  8. వారి గదిలోనికి కుటుంబసభ్యులు నేరుగా ప్రవేశించకూడదు.ఎందుకంటే ఆ గది పూర్తిగా ఇన్ఫెక్ట్‌ అయి ఉంటుంది. తగిన దూరం పాటిస్తూ  మీ చేతులను తరచూ శానిటైజ్‌ చేసుకోవాలి.
  9. అలాగే కుటుంబ సభ్యులు  కరోనా బారిన పడిన వ్యక్తి ఐసొలేషన్ పూర్తయిన అంతవరకు లేదా నెగటివ్ రిపోర్ట్ వచ్చే వరకు బయటి వ్యక్తులతో కాంటాక్ట్‌ అవ్వకూడదు. ఎందుకంటె ఇది వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది.

 

 

Add new comment

9 + 7 =