అశృనివాళి

జూన్ 13 2022న గురువుగా అభిషేకింపబడిన గురుశ్రీ ఖమ్సన్ మిమ్ ఖౌంతిచక్ గారు ఆగస్టు 2న దేవుని చెంతకు పిలువబడ్డారు..

ఫిలిప్పీన్స్‌, క్యూజోన్ సిటీ, సెయింట్ విన్సెంట్ స్కూల్ ఆఫ్ థియాలజీ వైద్యశాలలో ఆయన తుదిశ్వాస విడిచారని, థియాలజీ ఉపాధ్యాయులు గురుశ్రీ డానియల్ ఫ్రాంక్లిన్ ఇ. పిలారియో గారు , RVA న్యూస్‌తో తెలిపారు.

గురుశ్రీ  మిమ్ గారు పాక్సే అపోస్టోలిక్ వికారియేట్‌కు చెందిన వారు.

పాక్సే మేత్రానులవారి ప్రత్యేక అనుమతితో మరియు మిమ్ గారి అభ్యర్థన మేరకు జూన్ 13న, పపువా న్యూ గినియా, అలోటౌ-సిడియా మేత్రానులు మహా పూజ్య రోలాండో క్రిసోస్టోమో శాంటోస్ గారిచే గురువుగా అభిషేకింపబడ్డారు.

మిమ్ గారు లావోస్ యువ నాయకుడిగా 2008లో మనీలాకు వచ్చి ఫోండాసియో కమ్యూనిటీలో వేదాంతాన్ని అభ్యసించారు.

మనీలా, ఆడమ్సన్ విశ్వవిద్యాలయం నుండి మే 2022లో తన వేదాంత డిగ్రీ గ్రాడ్యుయేషన్ తేదీ సమీపిస్తుండగా, తను వెన్నునొప్పి మరియు నడిచే ఇబ్బందిని అనుభవించడం ప్రారంభమైయింది . అనేక వైద్య పరీక్షల తరువాత, అతను బోన్ మ్యారో క్యాన్సర్‌తో భాధపడ్తున్నారని, వ్యాధి చివరి దశలో ఉన్నారని తెలిసింది.

అతని పరిస్థితుల దృష్ట్యా, అతను చికిత్స పొందుతున్న ఆసుపత్రి గదిలో తను గురుత్వాని స్వీకరించడానికి  గురువిద్యాలయం అనుమతించింది. ఆయన 51 రోజులు గురువుగా మరణించడం బాధాకరం .

Add new comment

5 + 1 =