అనాథలకు నిత్యావసర వస్తువులను పంచిన కంకిపాడు విచారణలోని 10వ తరగతి విద్యార్థులు

విజయవాడ మేత్రాసనం కంకిపాడు10వ తరగతి విద్యార్థులు

అనాథలకు నిత్యావసర వస్తువులను పంచిన కంకిపాడు విచారణలోని 10వ తరగతి విద్యార్థులు

విజయవాడ మేత్రాసనం కంకిపాడు విచారణలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులు తపస్కాల ఆచారంలో భాగంగా, మర్చి16న గుణదలలోని మదర్ థెరిస్సా అనాథ శరణాలయాన్ని  సందర్శించారు. విద్యార్థులు అనాథలకు సరుకులు, గుడ్లు, కూరగాయలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి విద్యార్థులలో స్పూర్తిని నింపిన ఉపాధ్యాయులకు మరియు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు సహకరించిన వారందరికీ కంకిపాడు విచారణ గురువులు గురుశ్రీ నక్కా డేవిడ్ రాజు గారు  హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. 

Add new comment

4 + 12 =