అతి పెద్ద ప్రమాదాల నుండి మిమ్ములను మీ కుటుంబాలను కాపాడే అతి చిన్న చిహ్నాలు 

sacramentalsమన ఇంట్లో తప్పనిసరిగా ఉండవలిసిన మూడు దేవ ద్రవ్య చిహ్నాలు 

అతి పెద్ద ప్రమాదాల నుండి మిమ్ములను మీ కుటుంబాలను కాపాడే అతి చిన్న చిహ్నాలు 

 

మన గురువులు ఉపయోగించే దేవ ద్రవ్య చిహ్నాలు మన ఆత్మీక జీవితాన్ని బలపరచడానికే గాని ఆటంక పరచడానికి కాదు. మనకు క్రీస్తుతో బలమైన అనుబంధం కలిగి ఉండడానికి, మన జీవితాలు పవిత్రంగా ఉండడానికి మన కథోలిక పెద్దలు వీటిని ఆచరిస్తున్నారు. ఈ చిహ్నాలు దేవ ద్రవ్య అనుమానాలకు అనుబంధంగా వాడ బడుతున్నాయి.

ఈ చిహ్నాలు మన గృహాలలో మరింత శక్తివంతంగా ఉపయోగ పడతాయి. పరిపూర్ణ విశ్వాసంతో ఉపయోగిస్తే ఈ చిహ్నాలు మనకు హాని కలిగించే అపవిత్రాత్మలను మన నుండి దూరంగా ఉంచి మనలను దేవునికి దగ్గర చేస్తాయి.

అటువంటి చిహ్నాలు మూడు ఇక్కడ చర్చించుకుందాం.

1 . పవిత్ర జలం:

పవిత్రజలం మనకు మన బాప్తిస్మము మరియు ఆత్మా శుభ్రత అను రెండు విషయాలను గుర్తు చేస్తుంది. సాతాను పై ఈ పవిత్ర జలం చాలా ప్రభావాన్ని చూపుతుందని ప్రసిద్ధి. కలువరి గిరి పై సిలువలో వ్రేలాడిన క్రీస్తుని ప్రక్కలో నుండి కారి పడిన నీటికి చిహ్నమే ఈ పవిత్ర జలం. 

మన ఇంటి ముఖ ద్వారం వద్ద మరియు మన పడక గది వద్ద ఈ పవిత్ర జలాన్ని ఉంచడం చాల మంచిది. ఈ విధంగా చెయ్యడం వలన అను నిత్యం మనం దేవుని ధ్యానించడం అలవాటు అవుతుంది. మరియు ఈ పవిత్ర జలాన్ని మనం అందుబాటులో ఉంచుకుంటే, అపవిత్రాత్మల ఛాయలు కూడా మన వద్దకు చేరవు.

2 . ఆశీర్వదింపబడిన ఉప్పు

కుదిరితే మన ఇళ్లలో ఆశీర్వదింపబడిన ఉప్పు ఉంచుకోవడం ఎంతో మంచిది. మీరు మీ విచారణ గురువును అడిగితే ఆయన మీకు ఇస్తారు. కొన్ని సార్లు గురువు వద్ద కూడా ఇది దొరకకపోవచ్చు ఎందుకంటే మన వాళ్ళు ఈ అలవాటును ఎప్పుడో మానేశారు. కానీ ఇది అపవిత్రాత్మలను పారద్రోలడానికి ఎంతో ఉపకరిస్తుంది. 

3 . సిలువ

మనం సాధారణంగా మన ఇళ్లలో ఉపయోగించే మరొక చిహ్నం సిలువ. ఇది దేవుని అపారమైన ప్రేమకు చిహ్నం మాత్రమే కాదు, సాతానును ఓడించి మరణపు ముల్లును విరిచిన ఆ క్రీస్తు ప్రభునికి నిదర్శనం. క్రీస్తు ప్రభువు మన కొరకు చేసిన త్యాగాన్ని స్మరణ చేసుకొంటూ, శోధనలో పడకుండా ఉండడానికి మనం మన ఇంటిలోని ప్రతి గదిలో ఒక సిలువను ఉంచుకోవడం ఎంతో ఉపయుక్తం. 

మనం ఈ మూడు చిహ్నాలను ఎల్లపుడు మనతో ఉంచుకుంటూ, ఆ దేవుని స్మరించుకుంటూ సాతానుకు దూరంగా ఉండి ఆ దేవుని దయకు పాత్రులమగునట్లు కృషి చేద్దాం.

Add new comment

4 + 1 =