మానవతా విలువలు

మార్గము ఒకటే

అన్ని మతాలకు ఒక్కటే

నేటి సమాజం లో మనం ఇతరులని గుర్తించడానికి ఉపయోగించే ప్రాధమిక చిహ్నాలు - కులం, మతం, లింగము మరియు దేశ పౌరసత్వం మొదలగునవి. ఇటువంటి చిహ్నాలను చూస్తూ మనం ముఖ్యమైన ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. అది "అందరం ఒకే ఆత్మ నుండి ఉద్భవించాము" అని. ప్రాపంచిక చిహ్నాలైన కులం, మతం, లింగము వంటివి వ్యక్తిగతంగా మరియు సామాజికంగా ఎన్నో బేధాభిప్రాయాలు దారి తీస్తున్నాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు.

ప్రతి వ్యక్తి ఈ ప్రాపంచిక చిహ్నాలకంటే ఎంతో ఉన్నతుడు. మానవులంతా దైవత్వంలో భాగమే అని మనం గుర్తించాలి. మొదట మనం దైవత్వంలో భాగస్తులము, తర్వాతనే ఈ ప్రాపంచిక చిహ్నాలు వస్తాయి. దేవుని సృష్టి లో మానవులంతా ఒక్కటే. పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని గుర్తించడంతోపాటు మనం అన్ని ఆచారాలు బోధించు మానవతా విలువలలోని పరమార్ధాన్ని గ్రహించాలి. అన్ని మతాలకు మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. విలువలు, ఆచారాలు మరియు చిహ్నాలు. అన్ని మతాలకు మానవతా విలువలు ఒక్కటే కానీ ప్రతి మతం లోని ఆచారాలు, పద్ధతులు ఆయా మతాలకు వన్నె తెస్తాయి. ఇవే ఒక మతాన్ని మరో మతం నుండి వేరు చేస్తాయి. ఈ ఆచారాలు, మతపరమైన చిహ్నాలు పండు పైన ఉండే తోలు వంటివి. విలువలు అనేవి లోపలి పండు వంటివి. ఈ రోజులలో అందరం లోపలి పండు వదిలి పైన ఉండే తోలును చూసి ఆ పండు యొక్క నిజమైన రుచి అని అపోహ పడుతున్నాము. ఈ ఆచారాలు అనాది కాలం నుండి ఉన్నాయి, కాలక్రమేణా మార్పు చెందుతూ వస్తున్నాయి. సంస్కృతం లో "స్మ్రితి" అనే పదానికి అర్ధం " సమయము, స్థలమును బట్టి అనుసరించే పద్ధతులు". "స్మృతి" అంటే "సమాయంతో, స్థలంతో సంబంధం లేకుండా అనుసరించే పద్ధతులు" అని. అంటే అవి నిత్యం ఉంటాయి అన్నమాట.      

మనం సరిగ్గా గమనిస్తే అనంతమైన వాటి తర్వాతే అంతమయ్యేవి వస్తాయి. కానీ అన్ని మతాచారాలలో మనం దీనికి భిన్నమైన పోకడను గమనిస్తాం. అల్పమైన, కాలగమనంలో కలిసి మరుగైపోయే వాటికే మనం ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం. ఇటువంటి ధోరణి వల్లనే ఈరోజు ఎన్నో దేశాలు, ప్రాంతాలు అంతర్యుద్ధాలతో సతమతమౌతున్నాయి. నిశితంగా పరిశీలించి చూస్తే అన్ని మతాలలోని మానవతా విలువలు ఒక్కటే. అన్ని మాటలలో వేరు వేరు చిహ్నాలు, ఆచారాలు ఉండవచ్చు కానీ అన్నిటిలోను దాగిఉన్న నిగూఢ అర్ధం "సామరస్యమే". ఆచారాలు, కట్టుబాట్లు కాలక్రమేణా మారవచ్చు కానీ వాటిలోని మానవతా విలువలు ఎల్లప్పుడూ నవీనంగానే ఉంటాయి. ఒకప్పుడు మన పూర్వులు పాటించిన ఆచారాలు, కట్టుబాట్లు ఈనాడు అనాగరికంగాను, ఆటవికంగాను తోచవచ్చు. ఒకానొక సమయం లో కొరియా దేశంలో దొంగతనం చేసినవారి చేతులు నరికివేయబడాలి అని నియమం ఉండేది. ఒక దశలో క్రైస్తవునిగా జీవించాలంటే పేదరికంలోనే జీవించాలనేవారు. జైనులు డబ్బును తమ చేతులతో అనే ఒక నియమం ఉంది. కాలక్రమేణా ఇటువంటి నియమాలు, కట్టుబాట్లు మారుతూ వచ్చాయి.

ఈ ప్రపంచంలో అధికశాతం బాధలు, యుద్ధాలు జరగడానికి కారణం మతాల మధ్య, కులాల మధ్య ఉన్న బేదాభిప్రాయాలే. ఈ మతాల ముసుగును దాటి లోపల ఉన్న మానవతా విలువలు గ్రహించగలిగితే సర్వ మానవ సమానత్వం కనిపిస్తుంది. క్రీస్తు బోధించినట్లు "నీ వలే  నీ సహోదరుని ప్రేమించు" అనునది సాధ్యపడి ఒక నూతన, సామరస్య సమాజం నిర్మితమౌతుంది.

 

Add new comment

2 + 3 =