TELUGU CATHOLIC DAILY GOSPEL || అనుదిన దివ్యపూజ పఠనం (15.01.2020)

మార్కు సువార్త 1-29-39
29.పిదప యేసు ఆ ప్రార్ధన మందిరము నుండి యాకోబు, యోహానులతో తిన్నగా సీమోను, అంద్రెయల ఇంటికి పోయెను.
30. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి యుండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి.
31.ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేయి పట్టి లేపగా, జ్వరము వీడిపోయెను. అంతట ఆమె వారికి పరిచర్య చేయసాగెను.
32.సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసికొనివచ్చిరి.
33. ఆ పుర వాసులందరు ఆ ఇంటి వాకిట గుమిగూడిరి.
34.అపుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరిని యేసు స్వస్థపరచి, పెక్కు దయ్యములను వెడల గొట్టెను. తనను ఎరిగి యుండుట వలన ఆయన ఆ దయ్యములను మాటాడనీయ లేదు.
35. ఆయన వేకువ జాముననే లేచి, ఒక నిర్జన ప్రదేశమునకు పోయి, ప్రార్ధన చేయనారంభించెను.
36. సీమోను, అతని సహచరులు, ప్రభువును వెదకుచు వెళ్లి, ఆయనను కనుగొని,
37. అందరు మిమ్ము వెదకుచున్నారు" అని చెప్పిరి.
38. "మనము పరిసర గ్రామములకు పోవదము రండు. అచట కూడ నేను సువార్తను ప్రకటింపవలెను. ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చితిని" అని ఆయన వారితో చెప్పెను.
39. ఆయన ప్రార్థన మందిరములలో సువార్తను ప్రకటించుచు, దయ్యములను వెడల గొట్టుచు, గలిలీయ సీమ యందంతట పర్యటించెను.

Add new comment

15 + 5 =