TELUGU CATHOLIC DAILY GOSPEL || అనుదిన దివ్యపూజ పఠనం (14.01.2020)

మార్కు సువార్త 1-21-28
21. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమున ప్రవేశించి బోధింపసాగెను.
22.ఆయన బోధకు అచట నున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలన, ధర్మశాస్త్ర బోధకుల వలె గాక, అధికార పూర్వకముగ ఆయన బోధించెను.
23. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు,
24. "నజరేతు నివాసియగు యేసూ! మాతో నీ కేమిపని? మమ్ము నాశనము చేయ వచ్చితివా? నీవు ఎవరవో నేనెరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి" అని అరచెను.
25. "నోరు మూసికొని వీనినుండి వెడలి పొమ్ము" అని యేసు దానిని గద్దింపగ,
26. అది వానిని విలవిలలాడించి, బిగ్గరగ అరచి వదలి పోయెను.
27. అంతట అచ్చటివారందరు ఆశ్చర్య పడి, "ఇదేమి? అధికారముతో ఈ నూతన బోధ! ఈయన ఆజ్ఞాపింపగ అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి!" అని తమలో తాము గుసగుసలాడు కొనసాగిరి.
28. ఆయన కీర్తి గలిలీయ ప్రాంతమంతట వ్యాపించెను.

Add new comment

11 + 2 =