TELUGU CATHOLIC DAILY GOSPEL || అనుదిన దివ్యపూజ పఠనం (02.12.2019)

మత్తయి సువార్త 8:5-11

5. యేసు కఫర్నాములో ప్రవేశించు చుండగ, శతాధిపతి యొకడు ఆయనను సమీపించి,
6. "ప్రభూ! నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి యున్నాడు" అని తెలుపగ,
7. "నేను వచ్చి వానిని స్వస్థపరతును" అని యేసు ఆ శతాధిపతితో పలి కెను.
8. ఆ శతాధిపతి ఆయనతో, "ప్రభూ! నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికిన చాలును. నా సేవకుడు స్వస్థత పొందును.
9. నేను అధికారము గలవాడను. నా ఆధీనమందున్న ఏ సైనికుడినైనను నేను 'రమ్మనిన' వచ్చును; 'పొమ్మనిన' పోవును. నా సేవకుడు నేను 'చేయుము' అనిన దానిని చేయును? అని సవినయముగ పలికెను.
10. అది విని యేసు ఆశ్చర్యపడి, తన వెంట వచ్చుచున్న వారితో “యిస్రాయేలు ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును చూడ లేదు" అని నిశ్చయముగా చెప్పుచున్నాను.
11. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్య మందున్న అబ్రాహాము, ఈసాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు.

Add new comment

8 + 5 =