Daily Gospel l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(11.08.2019 )

లూకా సువార్త 12:32-48

32. ఓ చిన్నమందా! భయపడవలదు. మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము.
33.మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు. మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చు కొనుడు. మీ సంపదను పరలోకమున పదిల పరచుకొనుడు. చెదపురుగులు తిని వేయవు.
34.మీ సంపద ఉన్న చోటనే మీ హృదయ ముండును.
35.మీ నడుములు కట్టుకొనుడు. మీ దీపములను వెలుగు చుండనిండు.
36. తమ యజమాని వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురు చూచు వారివలె ఉండుడు.
37.యజమాని వచ్చునప్పుడు మేల్కొని సిద్ధముగ ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని, వారిని భోజనముకు కూర్చుండ బెట్టి, తానే వచ్చి వారికి వడ్డించును అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను.
38. అతడు అర్థరాత్రి వెళ వచ్చినను, ఆ తరువాత వచ్చినను అట్లు వేచియున్న సేవకులు ధన్యులు.
39.దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన యెడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వేయ నీయడని తెలిసికొనుడు.
40. కనుక, మీరు సిద్దపడి ఉండుడు. ఏలయన, మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును" అని చెప్పెను.
41.“ప్రభూ! మీరు ఈ ఉపమానము మాకు మాత్రమేనా? లేక అందరికి చెప్పుచున్నారా?" అని పేతురు ప్రశ్నించెను.
42. అందుకు యేసు ఇట్లనెను: "విశ్వాస పాత్రుడు, వివేకవంతుడైన సేవకుడెవడు? యాజమానిచే తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడిన వాడే .
43.యజమాని ఇంటికి తిరిగి వచ్చినపుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు.
44.అట్టి వానికి తన సమస్తముపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
45.కాని, యజమానుడు చాల కాలమునకు గాని తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి దాసులను, దాసిరాండ్రను కొట్టుచు, తిని, త్రాగి, మత్తుగపడి ఉండినయెడల
46.అతడు ఊహింపని సమయములో, యోచింపని గడియలో యజమాని తిరిగి వచ్చి, ఆ సేవకుని చిత్రవధ చేయించి అవిశ్వాసులలో ఒకనిగ చేయును.
47. యజమానుని ఇష్టమెరిగి సిద్దముగ ఉండనట్టి, అతని ఇష్టానుసారము నడుచు కొననట్టి సేవకుడు కొరడాదెబ్బలకు గురియగును.
48.కాని తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠినశిక్ష ఉండదు. మను ష్యులు ఎవనికి ఎక్కువగ అప్పగింతురో వానినుండి మరి ఎక్కువగ అడుగుదురు.

Add new comment

5 + 12 =