Daily Gospel l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(09.08.2019 )

మత్తయి సువార్త 16:24-28

24. "నన్ను అనుసరింపగోరు వాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను.
25. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు, దానిని పోగొట్టు కొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు, దానిని దక్కించుకొనును.
26. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు?
27. మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి యొక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును.
28. ఇచ్చట నున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృ శ్యమును చూచునంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను" అని యేసు శిష్యులతో పలికెను.

Add new comment

7 + 7 =