Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
Daily Gospel l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(08.08.2019 )
మత్తయి సువార్త 16:13-23
13. తరువాత యేసు, ఫిలిప్పు కైసరయా ప్రాంతమునకు వచ్చెను. "ప్రజలు మనుష్య కుమారుడు ఎవ్వరని భావించుచున్నారు?" అని తన శిష్యులను ఆయన అడిగెను.
14. అందుకు వారు "కొందరు బప్తిస్మ యోహాను అని, కొందరు ఏలియా అని, మరికొందరు యిర్మీయా లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు" అనిరి.
15. "మరి నేను ఎవరని మీరు భావించు చున్నారు?" అని యేసు వారిని అడిగెను.
16. అందుకు సీమోను పేతురు, "నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని సమాధానమిచ్చెను.
17. "యోనా పుత్రుడవగు సీమోనూ! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోక మందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు.
18. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు.
19. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో, అది పరలోకమందు బంధింప బడును; భూలోకమందు నీవు దేనిని విప్పుదువో, అది పరలోకమందు విప్పబడును."
20. ఇట్లు చెప్పి, తాను క్రీస్తునని ఎవరితో చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను .
21. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేముకు వెళ్లి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి, మరణించి మూడవ దినమున పునరుత్దానుడగుట అగత్యమని వచించెను.
22. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, "ప్రభూ! దేవుడు దీనిని నీకు దూరము చేయును గాక! ఇది ఎన్నటికి నీకు సంభవింపకుండును గాక" అని వారింప సాగెను
23. అందుకు ఆయన పేతురుతో 'ఓ సైతానూ! నా వెనుకకు పొమ్ము. నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవి కావు" అనెను.
Add new comment