Daily Gospel l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(07.08.2019 )

మత్తయి సువార్త 15:21-28

21. యేసు అటనుండి తూరు, సీదోను పట్టణముల ప్రాంతమునకు వెల్లెను.
22. ఆ ప్రాంతమున నివసించుచున్నకననీయ స్త్రీ ఒకతె ఆయన వద్దకు వచ్చి, "ప్రభూ ! దావీదు కుమారా! నాపై దయచూపము. దయ్యము పట్టి నాకుమార్తె మిక్కిలి బాధపడుచున్నది" అని మొరపెట్టుకొనెను.
23. ఆయన ఆమెతో ఒక్క మాటైన మాట్లాడలేదు. అపుడు ఆయన శిష్యులు సమీపించి “ఈమె మన వెంటబడి అరచు చున్నది, ఈమెను పంపివేయుడు” అనిరి.
24.'నేను యిస్రాయేలు వంశమున చెదరిపోయిన గొఱ్ఱెల కొరకు మాత్రమే పంపబడితిని" అని ఆయన సమాధానమిచ్చెను.
25. ఐనను ఆమె వచ్చి, ఆయన పాదములపై పడి "ప్రభూ! నాకు సాయపడుము" అని ప్రార్థించెను.
26. "బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు" అని ఆయన సమాధాన మిచ్చెను.
27. అందుకు ఆమె, "అది నిజమే ప్రభూ! కాని తమ యజమాని భోజనపు బల్ల నుండి క్రిందపడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినునుగదా!" అని బదులు పలికెను.
28. యేసు ఇది విని "అమ్మా! నీ విశ్వాసము గొప్పది. నీ కోరిక నెరవేరునుగాక" అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను.

Add new comment

4 + 4 =