Daily Gospel l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(06.08.2019 )

లూకా సువార్త 9:28-36

28. ఈ బోధలు చేసిన పిదప దాదాపు ఎనిమిది రోజులకు పేతురు, యోహాను, యాకోబులను వెంట బెట్టుకొని ఆయన ప్రార్థన చేసికొనుటకై పర్వతము పైకి వెల్లెను.
29. ఆయన ప్రార్థన చేసికొనుచుండగ యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగ ప్రకాశించెను.
30. అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించు చుండిరి. వారు మోషే ఏలియా అనువారు.
31.వారిద్దరు మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింప వలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడు చుండిరి.
32.పేతురు, అతని తోడివారు నిద్రమత్తులో ఉండిరి. వారు మేల్కొనినపుడు యేసు మహిమను, ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి.
33.వారిద్దరు ఆయన యొద్ద నుండి వెళ్లిపోవుచుండగ, పేతురు "ప్రభూ! మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు మూడు గుడారముల ను నిర్మింతుము" అని తాను పలుకునది తనకే తెలియక మాట్లాడెను.
34. అతడు ఇట్లు పలుకుచుండగ ఒక మేఘము ఆ శిష్యులను క్రమ్ముకొని వారిని ఆవరించెను. అపుడు వారు భయపడిరి.
35.ఆ మేఘము నుండి ఒక వాణి "ఈయన నా కుమారుడు. నేను ఎన్నిక చేసికొనిన వాడు. ఈయనను ఆలకింపుడు” అని వినిపించెను.
36. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవ్వరికి చెప్పలేదు.

Add new comment

20 + 0 =