Daily Gospel l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(05.08.2019 )

మత్తయి సువార్త 14:13-21

13. యేసు ఈ వార్త విని, అచట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగ ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున ఆయనను కాలినడకన వెంబడించిరి.
14. యేసు ఒడ్డుచేరి గొప్ప జనసమూహమును చూచి, జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను.
15. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి "ఇది నిర్జనప్రదేశము. వేళ అతిక్రమించినది. ఇక వారిని పంపివేయుడు. పల్లెపట్టులకు వెళ్లి, వారికి కావలసిన ఆహారమును సమకూర్చుకొందురు" అని మనవి చేసిరి.
16. అప్పుడు యేసు “వీరిని పంపివేయ వలసిన అవసరము లేదు. మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు” అని శిష్యులతో అనెను .
17. "మా వద్ద ఐదు రొట్టెలు, రెండు చేపలు తప్ప మరేమియు లేవు" అని వారు ప్రత్యుత్తర మిచ్చిరి.
18. "వాటిని ఇచటకు తీసికొని రండు" అని చెప్పి
19. యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను; ఆ అయిదు రొట్టెలను, రెండు చేపలను తీసికొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి, త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి.
20. వారందరు భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను పండ్రెండు గంపల నిండ ఎత్తిరి.
21. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు,, పిల్లలు కాక, దాదాపు ఐదువేల మంది పురుషులున్నారు.

Add new comment

12 + 1 =