Daily Gospel l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(04.08.2019 )

లూకా సువార్త 12:13-21

13. జనసమూహము నుండి ఒకడు “బోధకుడా! పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సోదరునితో ఒక మాట చెప్పుము" అనెను.
14. అందుకు యేసు "నన్ను ఎవడు మీకు తీర్పిరిగ లేక పంపిణీదారునిగ నియమించెను?
15. జాగరూకత వహింపుడు. ఎట్టి లోభమునకు లోనుకాకుడు. ఏలయన, మానవ జీవితము సిరిసంపదల సమృద్ధిలో లేదు" అని చెప్పెను.
16.యేసు ఇంకను వారితో ఒక ఉపమానము చెప్పెను: "ఒక ధనవంతునికి సమృద్ధిగ పంటలు పండినవి.
17. అతడు ఇట్లనుకొనెను: "నేను ఏమి చేయవలెను? పంటలు భద్రపరచుకొనుటకు నాకు చాలినంత స్థలము లేదు .
18. ఒక పని చేసెదను. కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగ కట్టెదను. అందు నా ధాన్యమును, సరకులను అన్నిటిని భద్రపరచెదను.
19. నాతో ఇట్లని చెప్పుకొందును. "నా ప్రాణమా! నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగ ఉండుము. తిని, త్రాగి ఆనందింపుము."
20.కాని దేవుడు అతనితో 'ఓరి! అవివేకి! ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అపుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును?" అనెను.
21. తన కొరకు ధనము కూడబెట్టుకొనువారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు" అని చెప్పెను.

Add new comment

2 + 0 =