Daily Gospe l Daily Reflections |అనుదిన దివ్యపూజ పఠనం(22.07.2019 )|

యోహాను సువార్త 20:1-2, 11-18

 

1. ఆదివారము తెల తెలవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధిమీద రాయి తీసి వేయబడి ఉండుట చూచెను.
2. అంతట ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయి, "వారు ప్రభువును సమాధినుండి ఎత్తికొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము" అని చెప్పెను.

11.కాని, మరియ సమాధియొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు, ఆమె వంగి సమాధిలోకి తొంగిచూడగ
12. ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి, కాళ్ల వైపున ఒకరు, తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి యుండిరి.
13.“అమ్మా! నీవెందుకు ఏడ్చుచున్నావు?” అని వారడిగిరి. "నా ప్రభువును ఎవరో ఎత్తుకొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు” అని ఆమె చెప్పెను.
14. అట్లు చెప్పి, ఆమె వెనుకకు తిరిగి, యేసు నిలువబడి ఉండుటను చూచెను. కాని, ఆమె ఆయనను గుర్తింపలేదు.
15. యేసు ఆమెతో "అమ్మా! నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవెవరిని వెదకుచున్నావు? " అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, "అయ్యా! నీవు ఆయనను తీసికొని వెళ్లిన యెడల, ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము. నేను వెళ్లి తీసికొని పోయెదను" అనెను.
16. 'మరియ" అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో 'రబ్బూని” (అనగా 'బోధకుడా’ అని అర్థము) అని పిలిచెను.
17.యేసు ఆమెతో "నన్ను ముట్టుకొనవద్దు. నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్లి నా సహోదరులతో ఇట్లు చెప్పుము: నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను" అని చెప్పెను.
18. మగ్ధల మరియ వెళ్లి, శిష్యులతో, "నేను ప్రభువును చూచితిని" అని వారికి ప్రభు సందేశమును అందజేసెను.

Comments

Praise the lord...Amen

Add new comment

6 + 14 =